
సన్‌రైజర్స్‌కు పోటీగా..
నాలుగు మ్యాచ్‌లల్లో ఓటమి అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మరింత కిందికి దిగజారింది. 10 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్‌పై ఘన విజయాన్ని సాధించిన అనంతరం పంజాబ్ కింగ్స్ మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. 12 పాయింట్లతో సన్‌రైజర్స్‌కు అడ్డుగా నిలిచింది. ఢిల్లీ కేపిటల్స్ కూడా 12 పాయింట్లతో సన్‌రైజర్స్ కంటే ముందంజలో. ఈ అడ్డంకిని అధిగమించాలంటే సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.

ఫస్ట్ హాఫ్‌లో చిత్తు..
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్- కోల్‌కత నైట్‌రైడర్స్ మధ్య పోరు రెండోసారి. ఫస్ట్ హాఫ్‌లో తన అయిదో మ్యాచ్‌లో ఈ జట్టును చిత్తు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 175 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. సెకెండ్ హాఫ్‌లో మరోసారి తలపడబోతోంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నప్పటి దూకుడుతనం ప్రస్తుతం సన్‌రైజర్స్ క్యాంప్‌లో లేదు. ఒక్క గెలుపు కోసం సర్వశక్తులనూ ధారపోయాల్సి వస్తోంది.

కేన్ విలియమ్సన్‌పై పెనుభారం..
కేన్ విలియమ్సన్ వ్యక్తిగతంగా భారీ స్కోర్ చేయట్లేదు. ఇప్పటి వరకు 57, మరోసారి 48 మాత్రమే అతని వ్యక్తిగత బెస్ట్ స్కోర్. గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడం వల్ల కేన్ ఇక బ్యాటింగ్‌కు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. కేన్ విలియమ్సన్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో 199 పరుగులు చేశాడు. కిందటి మ్యాచ్‌లో మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు. 96.14 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఇది మరీ ఘోరం. మిగిలిన జట్ల కేప్టెన్లందరితో పోల్చుకుంటే లీస్ట్‌లో ఉన్నాడు కేన్ మామ.

సెకెండ్ హాఫ్‌లో బౌలింగ్ దారుణం..
సెకెండ్ హాఫ్‌లో సన్‌రైజర్స్ బౌలింగ్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంటోంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను బాది అవతల పడేశారు. గుజరాత్ టైటాన్స్ 199, చెన్నై సూపర్ కింగ్స్ 202, ఢిల్లీ కేపిటల్స్ 207, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 192 పరుగులు చేశాయంటే సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ లోపాన్ని సన్‌రైజర్స్ సరిచేసుకోవాల్సి ఉంటుంది.