న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KL Rahul: పంజాబ్ కింగ్స్‌కు రాంరాం.. కేఎల్ రాహుల్‌పై కన్నేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్!!

IPL 2022 Mega Auction: KL Rahul To Play For Sunrisers Hyderabad After Quitting From Punjab Kings

హైదరాబాద్: ఎప్పటిలానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజ‌న్లో కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయిన పంజాబ్ కింగ్స్ టీమ్‌కు భారీ షాక్ తగలనుందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. కెప్టెన్‌గా టీమ్‌కు పెద్ద‌గా విజ‌యాలు అందించలేకపోయినా.. బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ వ‌చ్చే సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడడని ఓ క్రీడా ఛానెల్ పేర్కొంది. ఇదే నిజమయితే కింగ్స్‌కు భారీ షాక్ తగిలినట్టే. ఎందుకంటే.. గత నాలుగు సీజన్లుగా పంజాబ్ తరఫున 600లకు పైగా పరుగులు చేస్తున్న ఏకైక బ్యాటర్‌ రాహుల్ ఒక్కడే. ఈ సీజ‌న్‌లో 13 మ్యాచ్‌ల‌లో రాహుల్ 626 ప‌రుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో అత‌డే టాప్‌లో ఉన్నాడు.

కింగ్స్‌కు రాంరాం:

కింగ్స్‌కు రాంరాం:

పంజాబ్ కింగ్స్ టీమ్‌కు గుడ్‌బై చెప్పి.. ఐపీఎల్ 2022 కోసం జరగనున్న మెగా వేలంలోకి వెళ్లాల‌ని లోకేష్ రాహుల్ భావిస్తున్న‌ట్లు సమాచారం తెలిసింది. ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు రానున్న నేపథ్యంలో మెగా వేలం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. మెగా వేలం జరిగితే.. ప్ర‌తి ఫ్రాంచైజీ కేవ‌లం ముగ్గురు ప్లేయ‌ర్స్‌ను రిటేన్ చేసుకొని, మిగ‌తా అంద‌రినీ వ‌దిలేయాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో లోకేష్ రాహుల్‌ లాంటి ప్లేయ‌ర్‌ను రిటేన్ చేసుకోవ‌డానికి పంజాబ్ ఆసక్తిగానే ఉన్నా.. అతడు అందుకు సిద్ధంగా లేన‌ట్లు తెలుస్తోంది. కారణం ఇతర ప్లేయర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరుకోవడంలో విఫలమవుతోంది. రాహుల్ పెవిలియన్ చేరితే తరువాత జట్టును ఆదుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

600కుపైగా ప‌రుగులు:

600కుపైగా ప‌రుగులు:

2018 నుంచి పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న లోకేష్ రాహుల్‌.. గ‌త నాలుగేళ్లుగా ప్ర‌తి సీజ‌న్‌లో 600కుపైగా ప‌రుగులు చేయ‌డం విశేషం. అయితే కెప్టెన్‌గా మాత్రం పంజాబ్ టీమ్‌ను టైటిల్‌కు చేరువ చేయ‌లేక‌పోయాడు. ఈ సీజ‌న్‌లో 13 మ్యాచ్‌ల‌లో రాహుల్ 626 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్ 2020లో 14 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 670 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టుకు అతడు ప్రధాన ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 29 ఏళ్ల రాహుల్ 94 ఐపీఎల్ మ్యాచులలో 3273 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్ర‌స్తుతం యూఏఈలో ఉన్న రాహుల్‌.. టీ20 ప్రపంచకప్ కోసం బ‌బుల్‌లో చేరాడు.

రాహుల్‌పై కన్నేసిన సన్‌రైజర్స్‌:

రాహుల్‌పై కన్నేసిన సన్‌రైజర్స్‌:

ఒక‌వేళ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2022 మెగా వేలంలో పాల్గొంటే.. అత‌నికి భారీ ధ‌ర ప‌లికే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌టికే అత‌న్ని ప‌లు ఇత‌ర ఫ్రాంచైజీలు సంప్ర‌దించిన‌ట్లూ స‌మాచారం. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అతడిని జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుందని సమాచారం. కెప్టెన్, బ్యాటర్ రూపంలో రాహుల్ పనికొస్తాడని సన్‌రైజర్స్‌ మేనేజ్మెంట్ ఆలోచిస్తుందట. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ జట్టును వీడనున్నారని ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వార్నర్ ఇప్పటికే సారథ్య బాధ్యతలు కోల్పోగా.. కేన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే సన్‌రైజర్స్‌ మేనేజ్మెంట్ మంచి కెప్టెన్ కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్‌ను ఎంత ధరకైనా తీసుకోవాలనుకుంటుందట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఆరెంజ్ క్యాప్ రాహుల్ వద్దే:

ఆరెంజ్ క్యాప్ రాహుల్ వద్దే:

ప్రస్తుతం ఐపీఎల్ 2021 ముగిసేందుకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌ లీగ్ దశలో నిష్క్రమించినా అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఇప్పటికీ కేఎల్ రాహుల్ వద్దే ఉంది. పంజాబ్ కింగ్స్ టీమ్ నిరాశపరిచినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఏమాత్రం అభిమానులను నిరాశపరచలేదు. తన ఆటతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇతర ప్లేయర్ల సహకారం లేకపోవడంతో పంజాబ్ ఐపీఎల్‌లో రాణించలేకపోతోంది. సింగిల్‌గా పంజాబ్‌ను పోటీలో నిపిలిన రాహుల్.. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానం సాధించి.. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు.

Story first published: Tuesday, October 12, 2021, 14:32 [IST]
Other articles published on Oct 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X