న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పొల్లార్డ్ వికెట్ కోసం వల విసిరిన ధోనీ: చిక్కిన బిగ్ ఫిష్: మైండ్ బ్లోయింగ్ ఫీల్డింగ్ సెట్

IPL 2022, CSK vs MI: MS Dhoni sets up field for Kieron Pollards wicket fans calls just too epic

ముంబై: ఐపీఎల్‌ 2022లో భాగంగా గురువారం డీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్.. సూపర్‌గా గెలిచింది. చివరి బంతి వరకు హైటెన్షన్‌గా సాగిన ఈ పోరులో మహేంద్ర సింగ్ ధోనీ మేజిక్ చేశాడు. తనదైన స్టైల్‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. తన బ్రాండ్ షాట్స్‌ను చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచిందంటే ధోనీ వల్లే సాధ్యమైందనడంలో సందేహాలు అక్కర్లేదు.

పరువు పోయిందిగా..

పరువు పోయిందిగా..

ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్‌ పరువు పోయింది. వరుసగా ఏడు మ్యాచ్‌లల్లో ఓటమి పాలైంది. ఐపీఎల్‌లో ఏ సీజన్‌‌కు అయినా ఇదే రికార్డ్. ఇప్పటివరకు మరే జట్టు కూడా వరుసగా ఏడింట్లో ఓడిపోలేదు. ఈ ఓటమితో ఇక ముంబై కథ ముగిసినట్టే. ఇకపై ఆ జట్టు గెలిచినప్పటికీ.. దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇక మున్ముందు- ముంబై ఇండియన్స్ టీమ్ ఓ డెస్ట్రాయర్ క్యారెక్టర్‌లో పని చేసే అవకాశం ఉంది.

ధోనీ ఆల్‌రౌండర్..

ధోనీ ఆల్‌రౌండర్..

ఈ మ్యాచ్‌లో ధోనీ ఆల్‌రౌండర్‌ సత్తా చాటాడు. బ్యాటర్‌గా జట్టును గెలిపించడానికే అతను పరిమితం కాలేదు. వికెట్ల వెనక ఉండి కథను నడిపించాడు. షాడో కేప్టెన్‌గా పని చేశాడు. ఇన్ని సంవత్సరాలుగా ఎల్లో ఆర్మీకి నాయకత్వాన్ని వహిస్తూ వచ్చిన ధోనీ తొలిసారిగా తన కేప్టెన్సీ వదులుకున్న విషయం తెలిసిందే. ధోనీ స్థానంలో మరో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ జట్టుకు సారధ్య బాధ్యతలను తీసుకున్నప్పటికీ.. ఆ భారాన్ని ధోనీ మోస్తున్నట్టే.

బిగ్ ఫిష్ కోసం వల..

బిగ్ ఫిష్ కోసం వల..

బిగ్ ఫిష్ కీరన్ పొల్లార్డ్ కోసం ధోనీ వల విసిరిన విధానం.. అతని అనుభవానికి అద్దం పట్టింది. ఎనిమిది బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 14 పరుగులు చేసి.. ప్రమాదకరంగా కనిపించిన పొల్లార్డ్‌ను అవుట్ చేయడానికి ధోనీ ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఫీల్డింగ్ సెట్ చేసిన మరుసటి బంతికే అతను అవుట్ అయ్యాడు. ధోనీ అంచనాలు ఏ మాత్రం తప్పలేదు.. తప్పు కాలేదు. తాను ఫీల్డర్లను అలర్ట్ చేసిన ఆ తరువాతి బంతికి పొల్లార్డ్ పెవిలియన్ దారి పట్టాడు.

ఫీల్డింగ్ సెట్..

ఫీల్డింగ్ సెట్..

17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహీష్ తీక్షణ సంధించిన ఓవర్ అది. ఆ ఓవర్ తొలి బంతికి తిలక్ వర్మ సింగిల్ తీశాడు. స్ట్రైకింగ్ ఎండ్‌లోకి పొల్లార్డ్ చేరుకున్న తరువాత ధోనీ తమ బ్రెయిన్‌కు పని చెప్పాడు. పొల్లార్డ్ ఎలాంటి షాట్ ఆడతాడో ముందుగానే పసిగట్టాడు. దానికి అనుగుణంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఆఫ్ సైడ్ ప్లేయర్లను కాస్త దూరంగా వెళ్లాలంటూ సైగ చేశాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న ఫీల్డర్లనూ అలర్ట్ చేశాడు.

భారీ షాట్‌కు వెళ్లి..

బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేయాలంటూ సూచించాడు. తీక్షణ సంధించిన షార్ట్ లెంగ్త్ బంతిని లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడాడు పొల్లార్డ్. అది కాస్త నేరుగా వెళ్లి శివం దుబే చేతుల్లో వాలింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ధోనీ పనితనాన్ని నెటిజన్లు, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆకాశానికెత్తేస్తోన్నారు. మాస్టర్ పీస్ అంటూ అభివర్ణిస్తున్నారు. కేప్టెన్సీ లేకపోయినా.. జట్టు విజయాల్లో అతను పోసిస్తోన్న పాత్రను విస్మరించలేమంటూ కామెంట్స్ చేస్తోన్నారు.

Story first published: Friday, April 22, 2022, 7:58 [IST]
Other articles published on Apr 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X