న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవీంద్ర జడేజా.. ఒడ్డున పడ్డ చేపలాంటోడట: నాయకత్వ లక్షణాలు అస్సల్లేవట

IPL 2022, CSK: Ravindra Jadeja not a natural captain, he looked a fish out of water says Ravi Shastri

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు పీడకలల్లాంటివే. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లుగా పేరున్న ఈ రెండూ ఈ సీజన్‌లో ఘోరంగా విఫలం అయ్యాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కేప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహిస్తోన్న జట్లవి. ఈ రెండు టీమ్స్ కలిసి తొమ్మిదిసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ టైటిల్‌ను ఎగరేసుకెళ్లాయి. ఇందులో ముంబై ఇండియన్స్ వాటా.. అయిదు.

ఈ సీజన్‌లో రెండు జట్లు కూడా కూడబలుక్కున్నట్టు అధ్వాన్నంగా ఆడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌తో పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కొంతలో కొంత బెటర్. 11 మ్యాచ్‌ల్లలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగింట్లో విజయాలను అందుకోగా.. అదే 11 మ్యాచ్‌లను ఆడిన ముంబై ఇండియన్స్ గెలిచింది రెండే. ఈ రెండు టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుతాయనే ఆశల్లేవు గానీ.. ప్రత్యర్థుల అవకాశాలను మాత్రం దెబ్బకొట్టడం ఖాయం.

కాగా- ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా కేప్టెన్సీలో కొన్ని మ్యాచ్‌లను ఆడిన విషయం తెలిసిందే. కేప్టెన్సీ మార్పు వ్యవహారమే ఆ జట్టు విజయావకాశాలను దెబ్బకొట్టిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అటు రవీంద్ర జడేజా వ్యక్తిగత ఫామ్‌ను కూడా కోల్పోయాడు. బౌలింగ్‌లో పదును తగ్గింది. బ్యాటింగ్‌లో భారీ షాట్లను ఆడలేక ఒత్తిడికి గురయ్యాడు. కేప్టెన్సీ భారాన్ని అతను మోయలేకపోతున్నాడనే కారణంతోనే మళ్లీ జట్టు పగ్గాలను సీఎస్‌కే ఫ్రాంఛైజీ- ఎంఎస్ ధోనీ చేతుల్లో పెట్టింది.

రవీంద్ర జడేజా కేప్టెన్సీ గురించి తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం లేవని కుండబద్దలు కొట్టాడు. కేప్టెన్సీగా బాధ్యతలను స్వీకరించిన తరువాత రవీంద్ర జడేజా పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని చెప్పాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇదివరకు ఎప్పుడూ కేప్టెన్‌గా పని చేసిన అనుభవం జడేజాకు లేదని గుర్తు చేశాడు. అతను నేచురల్ కేప్టెన్ కాదని వ్యాఖ్యానించాడు.

కేప్టెన్‌గా కంటే ఓ ప్లేయర్‌గా మాత్రమే జట్టుకు అతని సేవలు ఉపయోగపడతాయని తేల్చి చెప్పాడు రవిశాస్త్రి. రవీంద్ర జడేజాకు కేప్టెన్‌ పగ్గాలను అప్పగించాలనుకుంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సీఎస్‌కే సారధ్య బాధ్యతలను మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగించడంపై రవిశాస్త్రి మాట్లాడుతూ- అతని కంటే మంచి ఆప్షన్ మరొకటి లేదని అన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఫాఫ్ డుప్లెసిస్ తరహాలో కేప్టెన్సీ ఆప్షన్ చెన్నైకి లేదని అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, May 11, 2022, 13:34 [IST]
Other articles published on May 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X