న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో బెంచ్‌కే పరిమితమవడం కంటే కౌంటీ క్రికెట్ ఆడుకోవడం ఉత్తమం: టామ్ బాంటన్

IPL 2021: Tom Banton says I need to be playing cricket instead of sitting on the bench
IPL 2021: Players Considering Skipping IPL and Focus On Domestic Cricket

లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తుది జట్టులో చోటు కోసం నిరీక్షించి, బెంచ్‌కే పరమితమవ్వడం కన్నా కౌంటీ క్రికెట్ ఆడుకోవడం ఉత్తమమని ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ టామ్ బాంటన్ అన్నాడు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌ తదుపరి సీజన్‌లో పాల్గొనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. త్వరలోనే తన సన్నిహితులును సంప్రదించి ఓ నిర్ణయానికి వస్తానని చెప్పాడు. తాజాగా స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంగ్లండ్ యువ సంచలనం ఐపీఎల్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బెంచ్‌కే పరిమితం..

బెంచ్‌కే పరిమితం..

'చిన్నప్పటి నుంచి ఐపీఎల్‌ను ఎంతో ఇష్టంగా చూస్తూ పెరిగాను. కానీ నేను బెంచ్ మీద కూర్చుకోవడం కన్నా క్రికెట్ ఆడాల్సిన స్టేజ్‌లో ఉన్నానదే నా ఫీలింగ్. గతేడాది ఈ విషయం నాకు బాగా తెలిసొచ్చింది. టోర్నీ అద్భుతంగా జరిగింది. కానీ నేనే ఎక్కువగా బెంచ్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే బ్యాటింగ్‌తో పాటు క్రికెట్‌ ఆడటాన్ని నేను చాలా మిస్సయ్యాను.

టెస్ట్ క్రికెట్ నా లక్ష్యం..

టెస్ట్ క్రికెట్ నా లక్ష్యం..

ఈ పరిస్థితుల్లో నేను కౌంటీ క్రికెట్ ఆడితే నా కెరీర్‌కు ఉపయోగపడనుంది. ఎందుకంటే నేను సొమర్‌సెట్ తరఫున రెడ్ బాల్ క్రికెట్‌ను చాలా మిస్సవుతున్నాను. ఇప్పటికీ నా లక్ష్యం ఇంగ్లండ్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే. అలా జరగాలంటే నేను మరింత రెడ్ బాల్ క్రికెట్ ఆడాలి. అయితే ఐపీఎల్‌పై ఇంకా నేను ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. నా సన్నిహితులతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తా'అని టామ్ బాంటన్ చెప్పుకొచ్చాడు.

వదులుకున్న కేకేఆర్

వదులుకున్న కేకేఆర్

ఇక గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన టామ్ బాంటన్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే అవకాశం దక్కించుకున్నాడు. వాటిలో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 18 పరగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. ఐపీఎల్ 2021 వేలం ప్రక్రియలో భాగంగా కేకేఆర్.. టామ్ బాంటన్‌ను వదులుకుంది. ఇక వచ్చే సీజన్ కోసం జరిగే వేలంలో టామ్ బాంటన్ కోసం ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.

 కేకేఆర్ రిటెన్షన్ లిస్ట్..

కేకేఆర్ రిటెన్షన్ లిస్ట్..

రిటైన్ ప్లేయర్లు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్)​, దినేశ్ కార్తీక్, ఆండ్రూ రసెల్, గున్రే, నాగర్​కోటి, కుల్దీప్ యాదవ్, ఫెర్గుసన్, నితీశ్ రానా, పీ కృష్ణ, వారియర్, శివం మావి, శుభ్​మన్ గిల్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి

వదులుకున్న ఆటగాళ్లు: టామ్ బాంటన్, క్రిస్ గ్రీన్, నాయక్, లాడ్, సిద్దార్థ్

Story first published: Thursday, January 28, 2021, 16:36 [IST]
Other articles published on Jan 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X