న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: తెలుగు ప్లేయర్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్!

IPL 2021: Sunrisers Hyderabad released telugu players Bavanaka Sandeep and Yerra Prudhvi Raj

హైదరాబాద్: ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమవుతోంది. ఈ వేలం ప్రక్రియలో భాగంగా బీసీసీఐ ఆదేశాల మేరకు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను బుధవారం ప్రకటించింది. మిగతా జట్లకు భిన్నంగా 22 మందిని రిటైన్ చేసుకున్న హైదరాబాద్.. కేవలం ఐదుగురి ప్లేయర్లనే వదిలేసుకుంది. ఈ ఐదుగురిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బావనక సందీప్, యర్ర పృథ్వీ రాజ్‌ను రిలీజ్ చేసింది. హైదరాబాద్‌‌లోని రామ్‌నగర్‌కు చెందిన 28 ఏళ్ల బావనక సందీప్‌ను గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కరోనాతో యూఏఈకి తరలిన ఆ సీజన్‌లో సందీప్‌కు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతను పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.

విఫలమైన సందీప్..

విఫలమైన సందీప్..

ఇక తాజాగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సందీప్ తీవ్రంగా నిరాశ పరిచాడు. హైదరాబాద్ జట్టు తరఫున 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్ కేవలం 121 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో తమిళనాడుపై చేసిన 41 పరుగులే అత్యధికం. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ అయిన సందీప్ కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్ సందీప్‌ను వదులుకుంది.

 ఆంధ్ర ప్లేయర్ పృథ్వీ..

ఆంధ్ర ప్లేయర్ పృథ్వీ..

గత సీజన్‌లో భువనేశ్వర్ గాయంతో దూరమవడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన యర్ర పృథ్వీ రాజ్‌ను కూడా హైదరాబాద్ వదులుకుంది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని దుగ్గిరాలకు చెందిన పృథ్వీరాజ్ ఆంధ్ర జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతాడు. అతను ఈ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడలేదు. పైగా భువనేశ్వర్ జట్టులోకి రావడంతో ఆరెంజ్ ఆర్మీ నుంచి పృథ్వీ రాజ్‌కు ఉద్వాసన తప్పలేదు.

 స్టార్లంతా జట్టులోనే..

స్టార్లంతా జట్టులోనే..

ఇక ఐపీఎల్ మినీ వేలంలో కేన్ విలియమ్సన్ జట్టు వీడుతాడని ప్రచారం జరిగినా.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక్క స్టార్ ప్లేయర్‌ను కూడా వదులుకోలేదు. కేన్ మామతో పాటు బెయిర్ స్టో, జాసన్ హోల్డర్, మహ్మద్ నబీలను అంటి పెట్టుకుంది. విదేశీ ఆటగాళ్లలో బిల్లీ స్టాన్‌లేక్, ఫాబియాన్ అలెన్‌లను మాత్రమే వదులుకుంది. పైగా గాయంతో గత సీజన్‌కు దూరమైన మిచెల్ మార్ష్‌ను కూడా అంటిపెట్టుకుంది.

ఆరెంజ్ ఆర్మీ ఫుల్ లిస్ట్..

ఆరెంజ్ ఆర్మీ ఫుల్ లిస్ట్..

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవాత్స్ గోస్వామి, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, రషీద్ ఖాన్, నటరాజన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమాద్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బసిల్ థంపి, షాబాజ్ నదీమ్, సిద్దార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్

వదులుకున్న ఆటగాళ్లు: బిల్లీ స్టాన్​లేక్, ఫాబియాన్ అలెన్, ఎస్ యాదవ్, బావనక సందీప్, యర్ర పృథ్వీరాజ్

Story first published: Wednesday, January 20, 2021, 20:40 [IST]
Other articles published on Jan 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X