న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS: 'చేతన్ సకారియాకు హ్యాట్సాఫ్.. ఇంత బాగా బౌలింగ్ చేస్తావని అస్సలు ఊహించలేదు'

IPL 2021, RR vs PBKS: Virender Sehwag praises Chetan Sakariya after brilliant IPL Debut
#IPL2021,RR vs PBKS : Virender Sehwag Salutes Chetan Sakariya After Brilliant IPL Debut

ఢిల్లీ: పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ చేతన్‌ సకారియా సూపర్బ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలలో సకారియా 31 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను తన సెకండ్ ఓవర్‌లోనే ఔట్ చేసిన సకారియా.. చివరి ఓవర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ (91), జై రిచర్డ్‌సన్ (0)ను ఔట్ చేశాడు. వరల్డ్ బెస్ట్ బౌలర్లు చేతులెత్తేసిన వేళ.. సకారియా అద్భుత బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను నిలువరించాడు. ఈ మ్యాచులో రాజస్తాన్‌ 4 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ సకారియా మాత్రం అందరి మనసు దోచుకున్నాడు. మాజీలు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

IPL 2021: అభిమానులకు ఉగాది శుభాకంక్షాలు చెప్పిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. వారి తెలుగు వింటే నవ్వులే (వీడియో)!IPL 2021: అభిమానులకు ఉగాది శుభాకంక్షాలు చెప్పిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. వారి తెలుగు వింటే నవ్వులే (వీడియో)!

అస్సలు ఊహించలేదు:

అస్సలు ఊహించలేదు:

చేతన్‌ సకారియాపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ఇంత అద్భుతంగా రాణిస్తాడని ఊహించలేదన్నాడు. 'చేతన్‌ సకారియా.. ఈ పేరును చాలాసార్లు విన్నాను. దేశవాళీ క్రికెట్‌లో తన ఆటను కూడా చూశాను. కానీ ఇంత బాగా బౌల్‌ చేస్తాడని అస్సలు ఊహించలేదు. దేశవాళీ క్రికెట్‌లో వివిధ రకాల బ్యాట్స్‌మెన్‌ను అతడు ఎదుర్కొని ఉండవచ్చు. అయితే ఐపీఎల్‌లో పరిస్థితి ఇందుకు భిన్నం. స్టార్‌ ఆటగాళ్లే ఎక్కువగా ఉంటారు. బంతిని బలంగా బాదేందుకే ప్రయత్నిస్తారు. అయినా కూడా బాగా బంతులు వేశాడు' అని వీరూ అన్నాడు.

గేల్‌ను భయపెట్టిన విధానం బాగుంది:

గేల్‌ను భయపెట్టిన విధానం బాగుంది:

'జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రా పంచుకున్న అభిప్రాయాల ప్రకారం.. తన బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఎక్కడ బౌండరీ బాదుతాడేమోనని అస్సలు భయపడకూడదు. అవకాశం దొరికేంతవరకు ఓపికగా వేచి చూసి.. గట్టిగా దెబ్బకొట్టాలి. అప్పుడే వికెట్లు ఎలా తీయాలన్న విషయంపై పూర్తి అవగాహన వస్తుంది. చేతన్‌ సకారియాలో ఇలాంటి లక్షణాలను నేను చూశాను. ఎంతో పట్టుదలగా ఆడాడు. తన బౌలింగ్‌లో వైవిధ్యం కనబడుతోంది. నోబాల్స్‌ వేసి ఉండవచ్చు. అయితే మయాంక్‌ అగర్వాల్‌ను అవుట్‌ చేసిన తీరు, క్రిస్‌ గేల్‌ను తన డెలివరీలతో భయపెట్టిన విధానం బాగుంది. రానున్న రోజుల్లో మరింత మెరుగవుతాడు' అని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ‌

క్రికెట్‌ పట్ల ఉన్న అంకితభావం అదే:

క్రికెట్‌ పట్ల ఉన్న అంకితభావం అదే:

'కొన్ని నెలల క్రితం చేతన్‌ సకారియా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ ట్రోఫీ ఆడుతున్న సందర్బంగా ఈ ఘటన జరిగింది. కానీ అతడి తల్లిదండ్రులు ఈ విషయం తనకు చెప్పలేదు. ఇది సకారియా కుటుంబానికి, అతడికి క్రికెట్‌ పట్ల ఉన్న అంకితభావం స్పష్టంగా తెలుస్తోంది' అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. తమ్ముడంటే సకారియాకు చాలా ఇష్టమని, అతను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడోనని ఈ విషయం చెప్పలేదని వారి తల్లిదండ్రులు ఇదివరకే మీడియాకు తెలియజేశారు. ఇక ఐపీఎల్ వేలంలో భారీ ధర (1.20 కోట్లు) పలికిన తర్వాత సకారియా కూడా తన తమ్ముడు లేని విషయాన్ని మీడియాకు తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.

అభిమానులు ఫిదా:

అభిమానులు ఫిదా:

మ్యాచ్‌లో మెరుగైన బౌలింగ్ ‌తోడు సన్నింగ్ క్యాచ్‌తో సకారియా ఔరా అనిపించాడు. క్రిస్ మోరిస్ వేసిన 18 ఓవర్ ఆఖరి బంతిని నికోలస్ పూరన్ ఫైన్ లెగ్‌లో షాట్ ఆడగా.. షార్ట్ ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సకారియా సూపర్ డైవ్‌తో బంతిని పట్టుకున్నాడు. అయితే గాల్లోనే బంతిని అందుకున్న సకారియా.. కిందపడే క్రమంలో బంతిని నేలకు తాకిందా? అనే సందేహం కలగడంతో థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించాడు. అయితే బంతి నేలకు తాకిందనే ఆధారం లభించకపోవడంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కు కట్టుబడి క్యాచ్ ఔట్ ఇచ్చాడు. సకారియా సూపర్ ఫీల్డింగ్‌కు మైదానంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు.

Story first published: Tuesday, April 13, 2021, 14:37 [IST]
Other articles published on Apr 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X