న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ ఇంకో 122 పరుగులు చేస్తే.. ఐపీఎల్ 2021లో ఆర్సీబీ కెప్టెన్‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే!!

IPL 2021, MI vs RCB: Virat Kohli 122 runs short to reach 6000 Club in the IPL
#IPL2021 : Virat Kohli ఇంకో 122 పరుగులు చేస్తే.. | RCB Vs MI || Oneindia Telugu

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌‌ 2021కు‌ సమయం దగ్గరపడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. ఈరోజు రాత్రి 7. 30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. రెండు జట్ల సారథులు భారత జట్టుకు రెండు కళ్లలాంటి వారు కావడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఫార్మాట్ ఏదైనా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వస్తోన్న పరుగుల మెషీన్‌, బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021లో కూడా పలు రికార్డులపై కన్నేశాడు.

ఇంకో 122 పరుగులు చేస్తే

ఇంకో 122 పరుగులు చేస్తే

ఐపీఎల్‌ చరిత్రలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 184 ఇన్నింగ్స్‌ల్లో 130.73 స్ట్రైక్‌ రేట్‌తో 38.16 సగటుతో 5878 పరుగులు చేశాడు. ఇంకో 122 పరుగులు చేస్తే.. టోర్నీ చరిత్రలో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ అవతరిస్తాడు. ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సురేష్ రైనా (5368), డేవిడ్ వార్నర్ (5254), రోహిత్ శర్మ (5230)లు కోహ్లీ తర్వాత ఉన్నారు. గతేడాది రైనా లీగ్ ఆడకపోవడంతో కోహ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. . విరాట్‌ ఇప్పటి వరకు ఐదు సెంచరీలు నమోదు చేశాడు. లీగ్‌లో విండీస్‌ హార్డ్‌హిట్టర్‌ క్రిస్ ‌గేల్‌ ఆరు శతకాలు బాదేశాడు.

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు

ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో‌ విరాట్‌ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. 2016 సీజన్‌లో 973 పరుగులు చేయడం ద్వారా సింగిల్‌ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును విరాట్ లిఖించాడు. ఆ సీజన్‌లో కోహ్లీ నాలుగు సెంచరీ బాది ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చాడు. ఒక సీజన్‌లో అత్యథిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్‌ వార్నర్‌ (848 పరుగులు 2016 సీజన్‌లో) రెండో స్థానంలో ఉండగా.. కేన్‌ విలియమ్సన్ ‌(735-2018 సీజన్‌లో) మూడో స్థానంలో ఉన్నాడు.

ఇంకా 269 పరుగులు

ఇంకా 269 పరుగులు

టీ20 ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేసుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 269 పరుగులు అవసరం. క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్ మాత్రమే ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేశారు. గేల్ 13 వేలకు పైగా పరుగులు చేసి అందరికంటే టాప్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ యావరేజ్‌ 46.90గా ఉంది. ఇది విరాట్ మిగతా పొజిషన్ల యావరేజ్‌ కంటే ఎక్కువ. మిగతా పొజిషన్లలో అతడి యావరేజ్‌ 34.0 మాత్రమే.

విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే

విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే

# బెంగళూరు (చాంపియన్స్‌ లీగ్‌ టీ20, ఐపీఎల్‌ కలుపుకుని) తరఫున 50 సార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించడానికి ఇంకా నాలుగు హాఫ్‌ సెంచరీలు అవసరం.

# ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ల మార్కును చేరడానికి ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికు వరకూ 192 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు.

# ఐపీఎల్‌లో 50 ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించడానికి ఇంకా ఆరు హాప్‌ సెంచరీలు అవసరం.

# ఐపీఎల్‌లో వాంఖడే స్టేడియంలో 58.4 సగటుతో 409 పరుగులు చేశాడు.

# ఐపీఎల్‌లో సందీప్‌ శర్మ బౌలింగ్‌లో అత్యధికంగా ఏడుసార్లు ఔటయ్యాడు.

MI vs RCB: తొలి మ్యాచ్‌కు ముందు.. ముంబై ఇండియన్స్‌కి వార్నింగ్ ఇచ్చిన టీమిండియా మాజీ స్పిన్నర్!!

Story first published: Friday, April 9, 2021, 15:32 [IST]
Other articles published on Apr 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X