న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs CSK: డుప్లెసిస్ విధ్వంసం‌.. గైక్వాడ్‌ హాఫ్ సెంచరీ! మెరిసిన ధోనీ.. కోల్‌కతా లక్ష్యం 221!

IPL 2021, KKR vs CSK: Faf du Plessis, Ruturaj Gaikwad power Chennai to 220 for 3

ముంబై: వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ ‌(95 నాటౌట్‌: 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (64: 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ) వీరవిహారం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ (25: 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (17: 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ ) కూడా మెరవడంతో కోల్‌కతా లక్ష్యం 221గా ఉంది. కోల్‌కతా బౌలర్లలో చక్రవర్తి, రసెల్, నరైన్ తలో వికెట్ పడగొట్టారు. కోల్‌కతా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ తన నాలుగు ఓవర్లలో 58 పరుగులు ఇవ్వడం విశేషం.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్‌ దంచి కొట్టారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. చెన్నై ఇన్నింగ్స్‌లో గైక్వాడ్‌, డుప్లెసిస్‌ ఆటే హైలైట్‌. కోల్‌కతా బౌలర్లను ఆటాడుకున్న ఈ జోడీ ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. దీంతో చెన్నై రన్ రేట్ ఎక్కడా పడిపోలేదు. ఇద్దరూ ఆద్యంతం కళ్లుచెదిరే బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడటంతో చెన్నై సునాయాసంగా 100 పరుగుల మార్క్ అందుకుంది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి చెన్నైకు బలమైన పునాది వేశారు.

గత మ్యాచ్‌ల్లో తడబడిన గైక్వాడ్‌ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. డుప్లెసిస్‌ 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే వరుణ్‌ చక్రవర్తి వేసిన 13వ ఓవర్‌లో రుతురాజ్‌.. కమిన్స్‌ చేతికి చిక్కి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై మొయిన్‌ అలీ(25; 12 బంతుల్లో 2x4, 2x6) కాసేపే క్రీజులో ఉన్నా ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. అయితే, ధాటిగా ఆడే క్రమంలో అతడు నరైన్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. అప్పటికి చెన్నై స్కోర్‌ 165/2. తర్వాత ధోనీ, డుప్లెసిస్‌ ధాటిగా ఆడారు.

ఇన్నింగ్స్ చివరలో ధాటిగా ఆడే క్రమంలో ధోనీ ఔట్ అయ్యాడు. రసెల్ ఓ ఆఫ్ స్టంప్ ఔట్ సైడ్ డెలివరీని బౌండరీ కొట్టబోగా.. షార్ట్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ డైవ్ చేసి మరీ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. చివరి ఓవర్లో డూప్లెసిస్ 2 సిక్సులు బాదగా.. రవీంద్ర జడేజా (6: 1 బంతుల్లో) సిక్స్ తో ఇన్నింగ్స్ ముగించాడు. అయితే డూప్లెసిస్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి(1/27) ఒక్కడే పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన కమిన్స్‌ ఏకంగా 58 పరుగులు సమర్పించుకున్నాడు.

PKBS vs SRH: యాహూ.. మన పొలంలో మొలకలు వచ్చాయ్! ఇక మాములుగా ఉండదు!PKBS vs SRH: యాహూ.. మన పొలంలో మొలకలు వచ్చాయ్! ఇక మాములుగా ఉండదు!

Story first published: Wednesday, April 21, 2021, 22:03 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X