న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL‌ 2021: మరో కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ.. మూడోసారి తప్పుచేస్తే అంతే సంగతులు!!

IPL 2021: If more than 2 offence for slow over-rate one match ban for the captain
IPL 2021 New Rules : Slow Over Rate Penalties కెప్టెన్‌కు ఒక మ్యాచ్‌ నిషేదం Harsh Fines || Oneindia

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021 కోసం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. జట్లు స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది. సాఫ్ట్‌ సిగ్నల్‌ తొలగింపు, షార్ట్‌ రన్‌పై థర్ఢ్‌ అంపైర్‌ కన్ను, 90 నిమిషాల్లోనే ఒక ఇన్నింగ్స్‌ పూర్తి చేయడం (20 ఓవర్లు) లాంటి కీలక నిర్ణయాలు బీసీసీఐ ఇప్పటికే తీసుకుంది. ఈ రూల్స్‌ అన్ని ఐపీఎల్ 2021‌ ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి.

IPL 2021: ముంబై ఇండియన్స్ 'క్యూటెస్ట్' సపోటర్.. రోహిత్ పుల్ షాట్ ఆడి అలరించిందిగా (వీడియో)!!IPL 2021: ముంబై ఇండియన్స్ 'క్యూటెస్ట్' సపోటర్.. రోహిత్ పుల్ షాట్ ఆడి అలరించిందిగా (వీడియో)!!

రూ. 24 లక్షల జరిమానాతో​ పాటు:

రూ. 24 లక్షల జరిమానాతో​ పాటు:

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కొన్ని మ్యాచ్‌లు సమయం కంటే ఎక్కువసేపు జరుగుతున్నాయి. దీంతో స్లో ఓవర్‌రేట్ నమోదు చేసే ఆయా జట్లకు బీసీసీఐ జరిమానా విధించనుంది. ఒక జట్టు మొదటిసారి స్లో ఓవర్‌ రేటు నమోదు చేస్తే.. సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా బీసీసీఐ విధించనుంది. రెండోసారి అదే పునరావృతం అయితే.. ఆ జట్టు కెప్టెన్‌కు రూ. 24 లక్షల జరిమానాతో​ పాటు జట్టులోని సభ్యులందరి ఫీజులో నుంచి రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విదిస్తుంది. అయితే ఇక్కడ కెప్టెన్‌కు మినహాయింపు ఉంటుంది.

మూడోసారి కూడా రిపీట్‌ అయితే:

మూడోసారి కూడా రిపీట్‌ అయితే:

ఇక మూడోసారి కూడా అదే రిపీట్‌ అయితే మాత్రం కెప్టెన్‌కు రూ .30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్‌ ఫీజు లోంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు. ఇక్కడ కూడా కెప్టెన్‌కు మినహాయింపు ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మ్యాచులు అన్ని నిర్ణీత సమయంలోనే ముగిసే అవకాశం ఉంది. 90 నిమిషాల్లోనే ఒక ఇన్నింగ్స్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.

90 నిమిషాల్లోనే:

90 నిమిషాల్లోనే:

ఈ సీజ‌న్‌కు కొత్త‌గా వ‌చ్చిన నిబంధ‌న‌ల్లో కీల‌క‌మైన‌ది 90 నిమిషాల్లోనే ఇన్నింగ్స్‌ 20వ ఓవ‌ర్ పూర్తి కావాలి. గ‌తంలో 90వ నిమిషం లేదా ఆలోపు 20వ ఓవ‌ర్ ప్రారంభించే వీలు ఉండేది. కానీ మ్యాచ్ స‌మ‌యం ఎక్కువ కాకుండా ఉండ‌టానికి బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఒక ఇన్నింగ్స్ క‌చ్చితంగా 90 నిమిషాల్లోనే (85 నిమిషాల ఆట + 5 నిమిషాల స్ట్రేట‌జిక్ టైమౌట్‌) ముగియాలి. ఆ లెక్క‌న గంట‌కు 14.11 ఓవ‌ర్లు వేయాలి.

బెంగళూరుతో ముంబై ఢీ:

బెంగళూరుతో ముంబై ఢీ:

ఏప్రిల్ 9 నుంచి జరిగే ఐపీఎల్‌ 2021 సందడి షురూ అయింది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు సైతం ఒక్కొక్కరుగా భారత్ చేరుకుంటున్నారు. కొన్ని ప్రాంఛైజీలు ఇప్పటికే సాధన మొదలెట్టాయి. ఇక చెన్నై వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడబోతున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ విజేతగా నిలిచిన ముంబై ఈసారి కూడా కప్ కొట్టాలని చూస్తోంది.

Story first published: Wednesday, March 31, 2021, 14:14 [IST]
Other articles published on Mar 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X