న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RCB: 'మొదటి బంతి నుంచే బాదుతూ.. చివరి వరకు తీసుకెళ్లడం నాకు అలవాటు లేని పని'

IPL 2021: Glenn Maxwell says I have plenty of freedom with AB de Villiers coming next

చెన్నై: మొదటి బంతి నుంచే బాదుతూ.. చివరి వరకు తీసుకెళ్లడం తనకు అలవాటు లేని పని అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్ టోర్నీలో నాలుగో ఫ్రాంచైజీకి ఆడుతున్నందుకు తనపై ఒత్తిడి ఉందని మ్యాక్సీ అంటున్నాడు. జట్టులో తనకు ప్రత్యేక పాత్ర ఇచ్చారని తెలిపాడు. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. నిర్జీవమైన పిచ్‌పై మొదటగా బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయగా.. ఆపై బౌలర్లు సత్తాచాటడంతో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో అనూహ్య విజయం అందుకుంది.

ఏబీ ఉండటంతో స్వేచ్ఛగా ఆడాను

ఏబీ ఉండటంతో స్వేచ్ఛగా ఆడాను

గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో అర్ధ శతకం నమోదు చేశాడు. మ్యాక్స్‌వెల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మ్యాక్సీ మాట్లాడుతూ... 'మా ఆరంభాలు చాలా బాగున్నాయి. ఇది నా కొత్త ఫ్రాంచైజీ. వారు నాకు ఓ ప్రత్యేక పాత్ర ఇచ్చారు. మన తర్వాత బ్యాటింగ్‌ చేసేవాళ్లుంటే స్వేచ్ఛగా ఆడగలుగుతాం. నా తర్వాత ఏబీ డివిలియర్స్ ఉండటంతో స్వేచ్ఛగా ఆడాను. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులోని పాత్రే ఇక్కడా పోషిస్తున్నాను. జట్టు యాజమాన్యం, సహాయ సిబ్బంది, ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు' అని అన్నాడు.

 అలవాటు లేని పని

అలవాటు లేని పని

'అనుభవంతో పరుగులు చేశాను. మొదటి బంతి నుంచే బాదుతూ చివరి వరకు తీసుకెళ్లడం నాకు అలవాటు లేని పని. ఇది నా నాలుగో ఐపీఎల్‌ జట్టు కాబట్టి ఒత్తిడి ఉంటుంది. నేను మరింత మెరుగ్గా ఆడేందుకు అదే కారణమవుతోంది. నేను బౌలింగ్ చేసే అవకాశం కోసం వేచి చూస్తున్నా. వాషింగ్టన్‌ సుందర్‌ మా జట్టులో సూపర్‌స్టార్‌. నేను బౌలింగ్‌ ఎక్కువగా చేయకపోతే.. బ్యాటుతో మరిన్ని పరుగులు చేయగలను' అని మ్యాక్స్‌వెల్‌ తెలిపాడు. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ తరపున మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లాడి 108 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాక్సీ తీవ్రంగా నిరాశపరచడంతో పంజాబ్‌ జట్టు అతన్ని రిలీజ్‌ చేసింది. ఐపీఎల్ 2021 వేలంలో బెంగళూరు మాక్స్‌వెల్‌ను రూ.14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

 17వ ఓవర్‌ వేయడం కష్టంగా అనిపించింది

17వ ఓవర్‌ వేయడం కష్టంగా అనిపించింది

'హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌ వేయడం కష్టంగా అనిపించింది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ నాపై నమ్మకంతో ఉండటం పట్ల సంతోషంగా ఉన్నాను. పిచ్‌ నుంచి నాకు సహకారం లభించింది. దానిని ఉపయోగించుకొని సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టాను. మరో ఓవర్‌ వేసేందుకూ సిద్ధంగానే ఉన్నా. కానీ మొహ్మద్ సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పరిస్థితులను బట్టి చూస్తే జానీ బెయిర్‌స్టో క్యాచ్‌ కీలకం. ఏదేమైనా నాకు మరో అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది' అని షాబాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నాడు. షాబాజ్‌ రెండు ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

చేతులు చెమట పట్టాయి

చేతులు చెమట పట్టాయి

'నా చేతులు చెమట పట్టాయి. నోబాల్స్‌ వేయడం మాత్రం తప్పే. సాధారణ పొరపాటు. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటా. ఒత్తిడితో కూడిన ఓవర్లు వేయాల్సి ఉంటుందని నాకు నేనే చెప్పుకున్నాను. మా కెప్టెన్‌కు నాపై విశ్వాసం ఉండటం సంతోషకరం. బంతి గరకుగా ఉన్నప్పుడే పరుగులు చేయడం సులభం. ఒక్కసారి బంతి నునుపుగా మారిందా షాట్లు ఆడటం కష్టమైపోతుంది. ఇక్కడ అన్ని మ్యాచుల్లో ఇలాగే జరుగుతోంది. విజయంపై ఎప్పుడూ నమ్మకంతో ఉండటం అవసరం' అని హర్షల్‌ పటేల్‌ చెప్పుకొచ్చాడు. హర్షల్‌ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

SRH vs RCB: బెంగళూరు చేతిలో హైదరాబాద్‌ ఓటమి.. ఈ తప్పిదాలే సన్‌రైజర్స్‌ కొంపముంచాయి!!

Story first published: Thursday, April 15, 2021, 12:45 [IST]
Other articles published on Apr 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X