
ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఒకానొక దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి రాగా.. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. దాంతో హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంటుందని అంతా ఊహించారు. కానీ ఒకే ఒక ఓవర్‌లో మ్యాచ్ పూర్తిగా బెంగళూరు చేతుల్లోకి వెళ్లిపోయింది. స్పిన్నర్ షబాజ్ అహ్మద్ 17వ వేసి జానీ బెయిర్‌స్టో (12), మనీశ్ పాండే (38), అబ్దుల్ సమద్ (0)ల వికెట్లు పడగొట్టాడు. ముగ్గురూ భారీ షాట్ ఆడబోయి వికెట్లు చేజార్చుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చెదిరిపోయింది. బెయిర్‌స్టో, సమద్ ఓపికతో ఆడుంటే.. సన్‌రైజర్స్ గెలిచేదే.

మనీశ్ పాండే నెమ్మదైన బ్యాటింగ్
కోల్‌కతాపై నెమ్మదిగా ఆడిన మనీశ్ పాండే బెంగళూరుపై అలానే ఆడాడు. గత రాత్రి 39 బంతుల్లో 38 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. అంటే.. మనీష్ బౌండరీల ద్వారానే 20 రన్స్ చేశాడు. మ్యాచులో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడాడు. అవసరం అయిన సమయంలో ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. మనీష్ పరుగులు చేస్తున్నా.. డాట్ బాల్స్ ఎక్కువగా ఆడుతూ జట్టు ఓటములకు కారణం అవుతున్నాడు. ఒకవేళ మనీష్ వేగంగా ఆడుంటే ఫలితం మరోలా ఉండేది.

విజయ్ శంకర్ అవసరమే లేదు
ఆల్‌రౌండర్‌గా బాధ్యతాయుతంగా ఆడాల్సిన స్థితిలో విజయ్ శంకర్.. తక్కువ పరుగులకే పెవిలిన్ చేరాడు. చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సిన దశలో అతడు భారీ షాట్లు ఆడాల్సి ఉంది. కానీ సింగిల్స్ తీస్తూ.. రన్‌రేట్‌ను మరింత పెంచాడు. ఇక 18వ ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. ఐదు బంతులు ఆడి కేవలం మూడు పరుగులే చేశాడు. గత మ్యాచులో కూడా 7 బంతుల్లో 11 పరుగులు చేసి కీలక సమయంలో ఔట్ అయ్యాడు. విజయ్ శంకర్ రెండు మ్యాచులలో క్రీజులో నిలిచుంటే సన్‌రైజర్స్ విజయాలు సాధించేదే.

సమస్యగా మారిన ఓపెనింగ్
హైదరాబాద్ జట్టుకు ఓపెనింగ్ కూడా పెద్ద సమస్యగా మారింది. ఎప్పటిలా జానీ బెయిర్‌స్టోతో కాకుండా వృద్ధిమాన్ సాహాతో ఓపెనింగ్ చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. కోల్‌కతాపై సాహా (7), వార్నర్ (3) ఇద్దరూ విఫలమయ్యారు. బెంగళూరుపై వార్నర్ (54; 37 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించినా.. సాహా (1) త్వరగానే పెవిలియన్ చేరాడు. సాహా ఓపెనింగ్ జట్టుకు అసలు కలిసిరావడం లేదు. బెంగళూరుపై బెయిర్‌స్టో ఓపెనింగ్ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పటికైనా బెయిర్‌స్టో ఓపెనింగ్ చేస్తే హైదరాబాద్ విజయాలు సాధిస్తుంది.

కేన్, జాదవ్ తుది జట్టులో ఉంటే
కేన్ విలియమ్సన్ తుది జట్టులో లేకపోవడం కూడా హైదరాబాద్ టీంకు పెద్ద మైనస్. మూడో స్థానంలో ఆడే కేన్.. పరుగులు చేస్తూ వికెట్లను అడ్డుకోవడం అతడి ప్రత్యేకత. కేన్ జట్టులో ఉంటే హైదరాబాద్ విజయాలు సాధించేదే. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలో అదరగొడుతున్నా.. డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇది కూడా మ్యాచ్ ఓటమికి ఓ కారణమే. చెన్నై లాంటి పిచ్‌పై ఛేదన కష్టమని తెలిసినా.. టాస్ గెలిచిన వార్నర్ బౌలింగ్ ఎంచుకోవడం కూడా మరో కారణం. చెపాక్ పిచ్‌పై మంచి అనుభవం ఉన్న కేదార్ జాదవ్ జట్టులో ఉంటే.. ఫలితం మరోలా ఉండేది.
SRH vs RCB:రన్స్ చేయడం మాకు కష్టమైనప్పుడు.. అవతలి వాళ్లకూ అంతే కదా! మా వాళ్లకి ఒక్కటే చెప్పా: కోహ్లీ


Click it and Unblock the Notifications
