న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క పనితో కేప్టెన్‌‌ సంజు శాంసన్‌ను తలదించుకునేలా చేసిన మోరిస్

IPL 2021, DC vs RR highlights: Morris has shows why they paid the big for him

ముంబై: క్రిస్ మోరిస్..ఐపీఎల్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌కు సంబంధించిన మినీ వేలంపాట నిర్వహించినప్పటి నుంచీ హాట్ టాపిక్‌గా ఉంటోన్న పేరు. ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు ఉన్న మోరిస్.. ఇక నిఖార్సయిన ఆల్‌రౌండర్ అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. 16.25 కోట్ల రూపాయలను ధారపోసి తనను తీసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓటమి ఖాయమనుకున్న జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ సారి ఛాంపియన్‌గా ఆవిర్భవిస్తుందనే అంచనాల మధ్య ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించిన ఢిల్లీ కేపిటల్స్‌ పరాజయాన్ని రుచి చూపించాడు.

పట్టుమని 10 పరుగులైనా చేయని అయిదు మంది

పట్టుమని 10 పరుగులైనా చేయని అయిదు మంది

148 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్‌ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్‌ అన్నీ అపశకునాలే ఎదురయ్యారు. 36 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ నలుగురు బ్యాట్స్‌మెన్లలో ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్‌ను చేయలేకపోయారు. తొలిమ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయిన కేప్టెన్ సంజు శాంసన్.. ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. నాలుగు పరులకే పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్, మనన్ వోహ్రా, శివమ్ దుబే, ఆ తరువాత రియన్ పరాగ్.. పట్టుమని 10 పరుగులు కూడా చేయలేదు. మిడిలార్డర్‌లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్ మాత్రమే కుదురుకోగలిగారు.

 మోరిస్ సిక్సులు..

మోరిస్ సిక్సులు..

ఈ పరిస్థితులమధ్య రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. డేవిడ్ మిల్లర్‌ ఆడుతున్న సమయంలో సింగిల్స్‌కే పరిమితమైన మోరిస్.. అతను అవుటైన తరువాత రెచ్చిపోయాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 43 బంతుల్లో రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 62 పరుగులు చేసిన మిల్లర్ అవుట్ కావడంతో అప్పటిదాకా విజయంపై ఉన్న ఆశలు సన్నగిల్లాయి. మోరిస్ ఆ లోటును తీరుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. అప్పటిదాకా డేవిడ్ మిల్లర్‌కు తోడుగా నిలిచిన ఈ దక్షిణాఫ్రికా బౌలర్.. వరుస బౌండరీలు బాదుతూ జట్టును విజయం వైపు నడిపించాడు.

చివరి రెండు ఓవర్లలో నాలుగు సిక్సర్లు..

చివరి రెండు ఓవర్లలో నాలుగు సిక్సర్లు..

12 బంతుల్లో 27 పరుగులను చేయాల్సిన దశలో క్రిస్ మోరిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు. దానితో సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సిన దశకు చేరింది. చివరి ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీశాడు. ఆ తర్వాత భారీ సిక్సర్ కొట్టాడు. దీనితో నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేయాల్సి ఉంది. మూడో బంతిని డిఫెన్స్ చేసిన మోరిస్.. నాలుగో బంతిని సిక్సర్ బాదాడు. మొత్తం 18 బంతుల్లో 4 భారీ సిక్సర్లు కొట్టి 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంక రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్‌‌ను గెలిపించాడు.

స్ట్రైక్ ఇవ్వడానికి నిరాకరించిన సంజు..

స్ట్రైక్ ఇవ్వడానికి నిరాకరించిన సంజు..

పంజాబ్స్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా క్రిస్ మోరిస్ చివరి ఓవర్ వరకూ ఆడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మోరిస్‌కు స్ట్రైక్ ఇవ్వడానికి సంజు శాంసన్ నిరాకరించాడు. అతను ఆడలేడని, బంతులను వృధా చేస్తాడనే కారణంతో రన్ తీసే అవకాశం వచ్చినప్పటికీ.. శాంసన్ దాన్ని తీయలేదు. ఆ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. తాను క్రీజ్‌లో ఉంటే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తనకు స్ట్రైక్ ఇచ్చి ఉంటే.. ఫలితం ఎలా ఉండేదో.. ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్‌లో నిరూపించాడు క్రిస్ మోరిస్. సంజు శాంసన్ తలదించుకునేలా చేశాడు.

Story first published: Friday, April 16, 2021, 8:23 [IST]
Other articles published on Apr 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X