న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs RCB: మైదానంలో ఈదురు గాలులు.. మ్యాచ్‌కు అంతరాయం!

Sandstorm in Ahmedabad delays start of 2nd innings

అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నరేంద్ర మోదీ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం మైదానంలో ఈదురుగాలులు వీస్తుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కలికంగా నిలిపివేశారు. దాంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభమవ్వడానికి మరింత ఆలస్యం కానుంది. ప్రస్తుతం మైదానంలో బలమైన గాలులు వీస్తున్నాయి. మైదానం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసింది. ఏబీ డివిలియర్స్(42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 నాటౌట్) పరుగుల విధ్వంసానికి అండగా యువ ప్లేయర్ పటిదార్(22 బంతుల్లో 2 సిక్స్‌లతో 31), గ్లేన్ మ్యాక్స్‌వెల్(20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 25) సత్తా చాటారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అవేశ్ ఖాన్, రబడా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. మార్కస్ స్టోయినిస్ వేసిన చివరి ఓవర్‌లోనే ఏబీడీ మూడు సిక్సర్లతో 23 పరుగుల పిండుకున్నాడు. దాంతో ఆర్‌సీబీ భారీ స్కోర్ చేయగలిగింది.

Story first published: Tuesday, April 27, 2021, 21:33 [IST]
Other articles published on Apr 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X