న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ మెడపై వేలాడుతోన్న కత్తి: పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌తో తేలనున్న భవితవ్యం.. కొత్త భయం

IPL 2021: CSK Captain MS Dhoni Can Be Banned After the Clash Against Punjab Kings

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా ఈ సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మరో హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. 7:30 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ధోనీ సేనకు ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయింది. ధోనీ డకౌట్, సామ్ కుర్రమ్ బ్యాటింగ్ మెరుపులు ఆ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాయి. 188 పరుగుల భారీ స్కోర్‌ను సాధించినప్పటికీ.. ఓటమి నుంచి బయటపడలేకపోయింది. తాజాగా మరో చిక్కును ఎదుర్కొంటోందా చెన్నై టీమ్.

పరాజయాల పరంపర..

పరాజయాల పరంపర..

గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ సీజన్‌లో ఘోర పరాజయాలు చెన్నైని ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌‌లో ఓటమి చవి చూసింది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 221 పరుగుల రికార్డ్ స్కోర్ చేసిన పంజాబ్ కింగ్స్‌ను ధోనీ సేన ఎదుర్కొనబోతోంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లూ తలపడటం ఇదే తొలిసారి. రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో సూపర్ కింగ్స్.. తమ జోరును కొనసాగించాలనే కసితో కేఎల్ రాహుల్ టీమ్ ఉన్నాయి.

ధోనీ మెడపై కత్తి..

ధోనీ మెడపై కత్తి..

దీనికి అదనంగా మహేంంద్ర సింగ్ ధోనీ మెడపై నిషేధపు కత్తి వేలాడుతోంది. ఈ మ్యాచ్‌ తరువాత.. ధోనీ భవితవ్యం ఏమిటనేది తేలిపోతుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ధోనీపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లోయర్ రన్‌రేట్ కారణంగా ధోనీపై ఇప్పటికే 12 లక్షల రూపాయల జరిమానా పడింది. స్లోయర్ రన్ రేట్ కారణంగా ఈ మొత్తాన్ని అతను చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. వాంఖెడే మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ గనక మరోసారి స్లోయర్ రన్‌రేట్‌ను నిషేధం తప్పకపోవచ్చు.

మరో పొరపాటు జరిగితే..

మరో పొరపాటు జరిగితే..

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూపొందించిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. ఏ జట్టయినా 90 నిమిషాల వ్యవధిలో 20 ఓవర్ల ఓటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. అది నిబంధన. దీన్ని ఉల్లంఘించిన జట్టు కేప్టెన్‌పై జరిమానాలను కొరడాను ఝుళిపిస్తుంది బీసీసీఐ. తొలి తప్పు కింద భారీగా జరిమానాను విధిస్తుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇదే సమస్యను ఎదుర్కొంది.

స్లోయర్ రన్‌రేట్ కారణంగా ధోనీ 12 లక్షల రూపాయల మొత్తాన్ని జరిమానాగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి మరో రెండు మ్యాచుల్లో గనక ఎదురైతే.. కేప్టెన్‌పై కఠిన చర్యలను తీసుకుంటుంది బీసీసీఐ. కేప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. ప్రస్తుతం ధోనీ ఈ పరిస్థితిలోనే ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స్లోయర్ రన్ రేట్ నమోదైతే.. నిషేధానికి మరింత చేరువ అవుతాడు.

Story first published: Friday, April 16, 2021, 14:47 [IST]
Other articles published on Apr 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X