న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: చెత్త ప్రదర్శనతో సన్‌రైజర్స్‌కు భారమవుతున్న భువనేశ్వర్ కుమార్!

IPL 2021: Bhuvneshwar Kumar Gives Worst Performance For SRH In IPL 2021
IPL 2021: SRH కు Bhuvneshwar Kumar భారం కాదు... Sunrisers సగం బలం, సత్తా చాటుతాడు| Oneindia Telugu

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ బలం, బలగం బౌలింగ్. ఆ బలంలో సగం భువనేశ్వర్ కుమారే అనడంలో అతిశయోక్తి లేదు. గత కొన్ని సీజన్లుగా భువీ కనబర్చిన ప్రదర్శనే దానికి నిదర్శనం. ఈ బలంతోనే ఇన్నాళ్లు హైదరాబాద్ నెట్టుకొచ్చింది. ఆ బౌలింగ్ బలానికి టాపార్డర్ బ్యాటింగ్ తోడవడంతో ప్లే ఆఫ్స్‌కు కూడా దూసుకెళ్లింది. స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడుకొని అద్భుత విజయాలందుకుంది. ప్రత్యర్థిని సాధారణ స్కోర్‌కే కట్టడి చేసి దెబ్బతీసింది. కానీ ఇప్పుడు ఆ భువనేశ్వరే.. జట్టుకు భారమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

దెబ్బ తీసిన భువీ వైఫల్యం..

దెబ్బ తీసిన భువీ వైఫల్యం..

ఈ సీజన్‌లో జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్న భువనేశ్వర్ కుమార్ వైఫల్యం టీమ్ విజయాలపై ప్రభావం చూపుతోంది. గాయంతో గత సీజన్ మధ్యలో తప్పుకున్న భువీ.. మళ్లీ ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన బౌలింగ్‌తో అదరగొట్టి సత్తా చాటాడు. దాంతో ఈ సారి కూడా సన్‌రైజర్స్‌కు తిరుగుండదని భావించారు. లీగ్ ఫస్టాఫ్ మ్యాచ్‌లు జరుగుతున్న వేదికలు కూడా సన్‌రైజర్స్ బౌలింగ్‌కు అనుకూలమైనవని, ఆ జట్టు అందరి కన్నా ముందే ప్లే ఆఫ్స్ చేరుతుందని విశ్లేషకులు తమ అంచనాలను వెల్లడించారు. కానీ భువనేశ్వర్ కుమార్ వైఫల్యానికి మిడిలార్డర్ బలహీనత తోడవ్వడంతో సన్‌రైజర్స్ ఇంకా బోణీ కొట్టలేదు. టాప్‌లో ఉండటం దేవడేరుగు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది.

12 ఓవర్లు 120 రన్స్..

12 ఓవర్లు 120 రన్స్..

భువనేశ్వర్ అంటేనే అందరికి గుర్తొచ్చేది అతని పొదుపైన బౌలింగ్. తన ఇన్‌ స్వింగ్, ఔట్ స్వింగ్ బౌలింగ్‌తో ఎంతటి బ్యాట్స్‌మెన్ అయినా బోల్తా కొట్టించడం అతని ప్రత్యేకత.

కానీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భువీ దారుణంగా విఫలమయ్యాడు. పూర్తిగా తడబడుతూ దారళంగా పరుగులిచ్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఒక వికెట్ మాత్రమే తీసిన భువీ.. 6 ఫోర్లు, 2 సిక్స్‌లు సమర్పించుకొని 45 పరుగులిచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో భువీ ఓ వికెట్ తీసి 30 రన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగులతో గెలుపొందింది.

ఒక్క వికెట్ లేదు..

ఒక్క వికెట్ లేదు..

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భువీ 45 పరుగులిచ్చుకున్నాడు. సహచర బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేస్తే భువీ ఒక్కడే విఫలమయ్యాడు. తన చివరి ఓవర్‌లోనే రెండు భారీ సిక్సర్లు సమర్పించుకొని 17 పరుగులిచ్చాడు. దాంతో 135 పరుగుల లోపే పరిమితం అవుతుందనుకున్న ముంబై.. 150 పరుగుల మార్క్ అందుకుంది. లక్ష్య చేధనలో హైదరాబాద్‌ను ఈ 17 పరుగులే ముంచాయి. దాంతో హైదరాబాద్‌కు మరో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో కనీసం ఒక్క వికెట్ తీయలేకపోయాడు. భువీ ఇలానే విఫలమైతే సన్‌రైజర్స్‌కు కష్టాలు తప్పవు.

Story first published: Saturday, April 17, 2021, 23:45 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X