న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020:రిషబ్ పంత్ గాయంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ కోసం ఢిల్లీ వేట..మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్..!

IPL 2020:With Rishabh Pant injury Delhi hunts for Wicket keeper batsman,opt for mid season transfer

దుబాయ్: మాంచి ఊపుమీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలక ఆటగాళ్ల గాయాల రూపంలో పెద్ద దెబ్బపడింది. ఇప్పటికే గాయంతో అమిత్ మిశ్రా జట్టుకు దూరంకాగా, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్‌లు కూడా గాయంతో జట్టుకు దూరమయ్యారు. అయితే బౌలర్ల స్థానంలో మరొకరు జట్టులోకి వచ్చినా... పంత్‌లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ స్థానంను భర్తీ చేయడం కష్టసాధ్యమే అని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో చాలా ఇబ్బందిగా కనిపించిన రిషబ్ పంత్... ఆ తర్వాత జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరొక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దొరక్క పోవడంతో విదేశీ ఆటగాడైన అలెక్స్ క్యారీని జట్టులో చోటు కల్పించి శిమ్రాన్ హెత్‌మెయిర్‌ను డ్రస్సింగ్ రూంకే పరిమితం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దేశీయ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ కోసం ఎదురుచూస్తోంది. ఎలాగూ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ ఉంది కాబట్టి ఇతర జట్టులోని ప్లేయర్‌ను కొనుగోలు చేసే తొలిజట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఆ ఛాన్స్ ఉంటుందో ఒకసారి చూద్దాం...

సన్‌రైజర్స్ నుంచి వృద్ధి మాన్ సాహా

సన్‌రైజర్స్ నుంచి వృద్ధి మాన్ సాహా

ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్‌పంత్‌కు గాయం అవడంతో అర్జెంటుగా ఒక దేశీయ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ కోసం ఢిల్లీ ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌ను ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టులో దేశీయ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధి మాన్ సాహా ఉన్నాడు. సన్‌రైజర్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో సాహా ఆడాడు. 31 బంతుల్లో 30 పరుగులు చేశాడు.

ఆ తర్వాత బరిలోకి దిగలేదు. ఇప్పుడు మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌కు వృద్ధిమాన్ సాహాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఎలాగు సాహా ప్రదర్శనతో అసంతృప్తితో ఉన్న సన్‌రైజర్స్ యాజమాన్యం, ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ధర ఇచ్చి కొనుగోలు చేస్తామంటే సాహాను ఢిల్లీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది సన్‌రైజర్స్ జట్టు. 2019 సీజన్‌కు ముందు శిఖర్ ధావన్‌ను ఢిల్లీకి అప్పగించి ఢిల్లీ ప్లేయర్లను ముగ్గురిని తీసుకుంది సన్‌రైజర్స్.

శ్రీవాత్స గోస్వామిపై కూడా కన్ను

శ్రీవాత్స గోస్వామిపై కూడా కన్ను

ఇక ఇదే సన్‌రైజర్స్ జట్టునుంచి మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శ్రీవాత్స గోస్వామి ఉన్నాడు. 2018 నుంచి జట్టుతో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. 2018లో సాహా గాయపడినప్పుడు శ్రీవాత్స 11 మంది ఆటగాళ్లలో జట్టులో చేరాడు. అయితే ఇక జానీ బెయిర్‌స్టో వచ్చాక మాత్రం తిరిగి డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉన్న శ్రీవాత్స గోస్వామి పై కూడా ఢిల్లీ ఎంక్వైరీ చేసే అవకాశాలున్నాయి. 2008లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్న గోస్వామిని సన్‌రైజర్స్ రూ.కోటి ఇచ్చి సొంతం చేసుకుంది.

చెన్నై జట్టులోని నారాయణ్ జగదీశన్

చెన్నై జట్టులోని నారాయణ్ జగదీశన్

ఇక తమిళనాడుకు చెందిన వికెట్‌ కీపర్ బ్యాట్స్‌మెన్ నారాయన్ జగదీశన్... చెన్నై సూపర్ కింగ్స్ తరపున తన తొలి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆడాడు. అయితే సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సీఎస్‌కే పీయూష్ చావ్లాను ఆడించడంతో నారాయణ్ జగదీశన్ స్టాండ్స్‌కే పరిమితమయ్యాడు. ఇక బెంగళూరుతో జరిగిన మ్యాచులో ఇద్దరు మాత్రమే 30 పరుగుల మార్కును దాటగా అందులో ఒకరు జగదీశన్. 28 బంతులు ఎదుర్కొని 33 పరుగులు చేసిన జగదీశన్ ఆ మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. భారీ షాట్లు ఆడగల సత్తా ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జగదీశన్‌ ఢిల్లీకి మరో ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోయే మూడు నాలుగు మ్యాచ్‌లకైనా జగదీశన్‌ను పెట్టుకుంటే చాలా లబ్ధి పొందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చెన్నై యాజమాన్యం మాత్రం ఎవరినీ వదులుకునేందుకు సిద్ధంగా లేదు అదే సమయంలో మరొకరిని కొనుగోలు చేసేందుకు కూడా రెడీగా లేదు.

మొత్తానికి రిషబ్ పంత్‌కు ప్రత్యామ్నాయంను చూసుకునే వరకు ఢిల్లీకి కష్టాలు తప్పదు. అయితే ప్రస్తుతం టాప్ 4లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో వేచిచూడాల్సిందే.

Story first published: Wednesday, October 14, 2020, 16:29 [IST]
Other articles published on Oct 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X