న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ఆడలేక..బీబీఎల్‌పై కన్నేశారా? ధోనీ, రైనాలతో పాటు లైన్‌లో మరికొందరు: ఆసీస్‌‌లో

IPL 2020: Suresh Raina, MS Dhoni, Yuvraj Singh likely to play In Big Bash League season 10

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ ముగిసిన వెంటనే మరో క్రికెట్ పండుగ ఆరంభం కాబోతోంది. టీ20 ఫార్మట్‌లోనే సాగే లీగ్ కావడం వల్ల క్రికెట్ ప్రేమికుల ఫోకస్ మొత్తం ఇక దానిపైనే ఉంటుంది. పైగా- ఎక్కువమంది విదేశీ క్రికెటర్లు ఆడే అవకాశం కూడా కల్పించడంతో మరింత రంజుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే- బిగ్ బాష్ లీగ్. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్ మెగా టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. డిసెంబర్ 3వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది.

ఒక్కో టీమ్‌లో ముగ్గురు విదేశీ క్రికెటర్లకు..

ఒక్కో టీమ్‌లో ముగ్గురు విదేశీ క్రికెటర్లకు..

ఒక్కో టీమ్‌లో ముగ్గురు విదేశీ క్రికెటర్లకు ఆడటానికి ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిబంధనల్లో స్వల్పంగా మార్పులు చేసింది. ఐపీఎల్‌లోొో ఒక్కో జట్టులో గరిష్ఠంగా నలుగురు విదేశీ ప్లేయర్లు ఆడటానికి ఛాన్స్ ఉంది. ఇదే తరహాలో ముగ్గురికి అవకాశం ఇవ్వడం వల్ల విదేశీ క్రికెటర్ల సంఖ్య ఈ సారి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ సారి భారత్ నుంచి కొంతమంది సీనియర్లు, మాజీ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

బీబీఎల్‌పై కన్నేసిన ధోనీ, రైనా..

బీబీఎల్‌పై కన్నేసిన ధోనీ, రైనా..

బీబీఎల్ టోర్నమెంట్లలో ఆడటానికి టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతను అన్ని ఫార్మట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్‌కు ఇంకా రిటైర్‌మెంట్ ప్రకటించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అదే తరహాలో బీబీఎల్‌లో కూడా ఆడటానికి ధోనీ ఆసక్తికరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన యువరాజ్ సింగ్ కూడా బీబీఎల్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది.

సురేష్ రైనాకు చిక్కులు..

సురేష్ రైనాకు చిక్కులు..

సురేష్ రైనా కూడా బీబీఎల్‌లో ఆడటానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ.. అతనికి విధానపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పరిధిలోని లేని టోర్నమెంట్లలో ఆడాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ అవసరం అవుతుంది. రైనా బీబీఎల్‌లో ఆడటానికి బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీని తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఓసీ లభిస్తే బీబీఎల్‌లో ఆడటానికి అనుమతి లభించినట్టే. రాబిన్ ఊతప్ప, యూసుఫ్ పఠాన్ వంటి మరికొందరు క్రికెటర్లు బీబీఎల్‌లో ఆడటానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

బీసీసీఐ నాన్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు అవకాశం..

బీసీసీఐ నాన్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు అవకాశం..

బీసీసీఐ నాన్ కాంట్రాక్ట్ క్రికెటర్లకు బీబీఎల్ వంటి టోర్నమెంట్లలో ఆడే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని సురేష్ రైనా చెబుతున్నాడు. తనతో పాటు యూసుఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప వంటి నాన్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో ఉన్న క్రికెటర్లకు విదేశీ ప్రైవేట్ టోర్నమెంట్లలో ఆడటానికి బీసీసీఐ అనుమతి ఇవ్వాలని అంటున్నాడు. దీనివల్ల తమ క్రికెటింగ్ స్కిల్స్ మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నాడు. ప్రస్తుతం తాము అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడట్లేదని గుర్తు చేశాడు. మహిళ క్రికెటర్లకు విదేశీ టోర్నమెంట్లలో ఆడే అవకాశాన్ని బీసీసీఐ ఇచ్చిందని, ఈ సారి మేల్ క్రికెటర్లకు ఆ అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

Story first published: Thursday, October 22, 2020, 20:53 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X