న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్‌ ఇలా ఓడిపోపోవడం ఇదేం మొదటిసారి కాదు.. ఇంతకుముందు రెండు సార్లు ఇలానే!!

IPL 2020: Sunrisers Hyderabad failed to chased lowest targets 3rd time in IPL

హైదరాబాద్: విజయలక్ష్యం 127 పరుగులు.. స్కోరు 100/3.. చేతిలో ఏడు వికెట్లు.. మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే విజయం వరిస్తుంది. కానీ ఇలాంటి పటిష్ట స్థితి నుంచి కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. 23 బంతుల్లో మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని అనూహ్య ఓటమిని ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. అనంతరం సన్‌రైజర్స్‌ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది.

2017లో మొదటిసారి

2017లో మొదటిసారి

గతంలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇలాగే రెండుసార్లు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. గెలవాల్సిన మ్యాచ్‌లు 2017లో ఓటమిపాలైతే ఎలా ఉంటుందో హైదరాబాద్‌ తొలిసారి చూపించింది. పుణెతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 స్కోర్‌ చేసింది. డ్వేన్ స్మిత్ ‌(34), బెన్ ‌స్టోక్స్ ‌(39), ఎంఎస్ ధోనీ (31) రాణించారు. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ గట్టిగానే పోరాడింది. డేవిడ్‌ వార్నర్ ‌(40), యువరాజ్‌ సింగ్ ‌(47) మెరవడంతో విజయం ఖాయమనుకున్నారంతా. అయితే కీలక సమయాల్లో వీరు ఔటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. దాంతో హైదరాబాద్‌ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 17 ఓవర్లకు 117/4తో విజయంవైపు దూసుకుపోతున్న సన్‌రైజర్స్..‌ 20 ఓవర్లకు మరో ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది.

 2019లో రెండోసారి

2019లో రెండోసారి

2019లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. కీరన్ పోలార్డ్‌ ఒక్కడే (46) ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. అనంతరం సన్‌రైజర్స్ 96 పరుగులకే ఆలౌట్ అయి ఘోర ఓటమిని చవిచూసింది. దీపక్‌ హూడా (20) టాప్‌ స్కోరర్‌. 33 పరుగులకు తొలి వికెట్‌ పడగా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ చేరారు. దాంతో 17.4 ఓవర్లలోనే 96 పరుగులకు చాపచుట్టారు. 40 పరుగుల తేడాతో గఓటమిపాలైంది.

2020లో మూడోసారి

2020లో మూడోసారి

ఇక శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. రషీద్‌ ఖాన్‌ (2/14), జేసన్ హోల్డర్‌ (2/27), సందీప్‌ (2/29) ధాటికి పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయలేకపోయారు. నికోలస్‌ పూరన్‌ (32 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ 19.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ వార్నర్‌ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చినా మిగిలిన వారు ఘోరంగా విఫలమవడంతో పరాజయం వైపు నిలిచింది.

స్వల్ప స్కోరును కాపాడుకున్న పంజాబ్

స్వల్ప స్కోరును కాపాడుకున్న పంజాబ్

మరోవైపు పంజాబ్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ స్వల్ప స్కోరును కాపాడుకున్న సందర్భాలు ఉన్నాయి. 2009లో ముంబైతో తలపడిన సందర్భంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 119 పరుగులే చేసింది. కుమార సంగక్కర‌ (45) టాప్‌ స్కోరర్‌. అనంతరం ముంబై 116/7కే పరిమితమైంది. దాంతో పంజాబ్‌ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. 2014లో కోల్‌కతాతో పోటీపడిన సందర్భంగా తొలుత బ్యాటింగ్‌ చేసి 132/9 స్కోర్‌ చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ ‌(37) టాప్‌ స్కోరర్‌. అనంతరం కోల్‌కతా 109 పరుగులకే 18.2 ఓవర్లలో ఆలౌట్ అయింది. 23 పరుగుల తేడాతో గెలుపొందింది.

అభిమానులకు శుభవార్త.. ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన క‌పిల్ దేవ్!!

Story first published: Sunday, October 25, 2020, 16:16 [IST]
Other articles published on Oct 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X