న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs KXIP: పొలార్డ్, కౌల్టర్ నీల్ మెరుపులు.. పంజాబ్ లక్ష్యం 177

 Pollard, Coulter-Nile fire Mumbai Indians to 176 in Dubai

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దాంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరొక వికెట్ పడగొట్టారు.

ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రోహిత్ శర్మ(9), సూర్యకుమార్ యాదవ్(0), ఇషాన్ కిషాన్(7) తీవ్రంగానిరాశ పరిచారు. వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 43 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కృనాల్‌తో డికాక్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

కానీ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో కృనాల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా(8), డికాక్ ఔటవ్వగా.. ఆఖర్లో కౌల్టర్ నీల్, కీరన్ పొలార్డ్ చెలరేగారు. ఈ జోడీ చివరి 21 బంతుల్లో 57 పరుగులు చేయడంతో ముంబై ప్రత్యర్థి ముందు టఫ్ టార్గెట్ ఉంచింది.

Story first published: Sunday, October 18, 2020, 21:20 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X