న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశం.. ఐపీఎల్‌పై తుది నిర్ణయం రేపే!!

IPL 2020: BCCI and Franchises Will Get on a Conference Call to Decide The Fate of The Event
IPL 2020 Final Decision On Tomorrow!

ముంబై: ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ ( కొవిడ్‌-19) తీవ్రత భారత్‌లో రోజురోజుకి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 415కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తాజాగా ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్‌ రెండవ దశలోనే ఉందని పలుమార్లు స్పష్టం చేసింది. అయితే ఈ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో కొవిడ్‌-19 దశపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) జరుగుతుందా లేదా అనే సందేహాలు మరింత ఎక్కువయ్యాయి.

<strong>అదరగొట్టారుగా.. అమ్రిష్‌పురి పాత్రలో ఇర్ఫాన్‌.. రాజ్‌కుమార్‌ పాత్రలో యూసుఫ్‌ (వీడియో)!!</strong>అదరగొట్టారుగా.. అమ్రిష్‌పురి పాత్రలో ఇర్ఫాన్‌.. రాజ్‌కుమార్‌ పాత్రలో యూసుఫ్‌ (వీడియో)!!

కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా సమావేశం

కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా సమావేశం

ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29న ఐపీఎల్‌-13 సీజన్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత్‌లో కరోనా కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేశారు. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు, మరోవైపు భారత్‌లోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఫ్రాంచైజీలు మంగళవారం కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా సమావేశం కానున్నాయి.

తుది నిర్ణయం రేపే

తుది నిర్ణయం రేపే

బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశంలోనే ఐపీఎల్‌ను మరికొంత కాలం వాయిదా వేయాలా లేక ఈ ఏడాదికి పూర్తిగా రద్దు చేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ముంబైలోని బీసీసీఐ కార్యాలయం తాత్కాలికంగా మూసి వేయడం, హోటల్లోనూ సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. ఈ సమావేశాన్ని కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా నిర్వహిస్తారు. ఈ సమావేశం అనంతరం ఐపీఎల్‌పై పూర్తి స్పష్టత రానుంది.

పూర్తిగా రద్దయితే

పూర్తిగా రద్దయితే

ఐపీఎల్‌ను కుదించి నిర్వహించాలని, ఒకవేళ వేసవి కాలంలో సాధ్యంకాకపోతే జూలై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఏర్పాటు చేసే అంశాన్ని బీసీసీఐ పరిశీలించింది. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోపే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్‌-2009ని దక్షిణాఫ్రికాలో 37 రోజులు నిర్వహించారు. ఇప్పుడూ పరిస్థితులు అనుకూలిస్తే కొన్ని రోజులు విదేశాల్లో, కొన్ని రోజులు స్వదేశంలో నిర్వహించేందుకు యోచిస్తున్నారు. ఒకవేళ ఐపీఎల్‌ 2020 సీజన్‌ పూర్తిగా రద్దయితే బీసీసీఐ సుమారు రూ. 3500 కోట్లు నష్టపోయే అవకాశముంది.

Story first published: Monday, March 23, 2020, 13:05 [IST]
Other articles published on Mar 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X