న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: వేలంలో ఎప్పుడూ ఊహించనిదే జరుగుతుంది, మా ఎంపిక వారిపైనే: పాంటింగ్

 IPL 2020: At the auction table, the unpredictable always happens, says Delhi Capitals coach Ricky Ponting

హైదరాబాద్: వచ్చే సీజన్ కోసం కోల్‌కతా వేదికగా జరిగే ఐపీఎల్ వేలంలో తమ దృష్టంతా విదేశీ పేసర్ల ఎంపికపైనే ఉంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. రాబోయే సీజన్ కోసం జట్టు లక్ష్యాలను చర్చించడానికి రికీ పాంటింగ్ శనివారం టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యులను కలిశారు.

ఈ సందర్భంగా రికీ పాంటింగ్ మాట్లాడుతూ "గత కొన్ని నెలలుగా తాము వేలం గురించి చాలాసార్లు చర్చించాం. ఎంతో సమయం తీసుకొని అందుకు సిద్ధమయ్యాం. ముందుగా మనమెన్ని ప్రణాళికలైనా వేయొచ్చు. వేలం జరిగేటప్పుడు ఏం జరుగుతుందో మాత్రం అంచనా వేయలేం" అని అన్నాడు.

7000 పరుగులు: డేవిడ్ వార్నర్ ఖాతాలో మరో రికార్డు, 12వ ఆటగాడిగా!7000 పరుగులు: డేవిడ్ వార్నర్ ఖాతాలో మరో రికార్డు, 12వ ఆటగాడిగా!

ఫాస్ట్ బౌలర్లపై దృష్టి సారించాం

ఫాస్ట్ బౌలర్లపై దృష్టి సారించాం

"వచ్చే వేలంలో మేం ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లపై దృష్టి సారించాం. ముఖ్యంగా విదేశీ ఫాస్ట్ బౌలర్లపై. పాట్ కమ్మిన్స్, క్రిస్ వోక్స్ భారీ ధర పలికే అవకాశం ఉంది. నా ప్రకారం ఆల్‌రౌండర్లపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, జిమ్మీ నీషామ్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్ వంటి ఆటగాళ్ళు ధర ఎక్కువే ఉండొచ్చు" అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

వేలానికి వెళ్లినప్పుడు

వేలానికి వెళ్లినప్పుడు

"వేలానికి వెళ్లినప్పుడు ఏ ఆటగాడిని తీసుకోవాలనే దానిపై నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు మాకిప్పుడు ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. మేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తుది జట్టుకు సంబంధించి ఎక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించుకోవాలి. ఆ దిశగా సరైన ప్రణాళిక వేసుకోవాలి" అని పాంటింగ్ అన్నాడు.

సెమీస్‌లో చెన్నై చేతిలో ఓటమి బాధాకరం

సెమీస్‌లో చెన్నై చేతిలో ఓటమి బాధాకరం

"గత సీజన్‌లో సెమీస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి బాధాకరం. అయితే, మేం ఆ సీజన్‌ అసాంతం మంచి క్రికెట్‌ ఆడాం. జట్టు సరదాగా గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తు. అనుభవం ఉన్న రహానే, అశ్విన్‌ కోట్లా వికెట్‌పై జట్టుకు ఎంతగానో ఉపయోగపడతారు" అని రికీ పాంటింగ్ చెప్పాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.27.85 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.27.85 కోట్లు

వచ్చే సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.27.85 కోట్లు ఉన్నాయి. ఐదుగురు విదేశీయులు సహా 11 మందిని ఎంపిక చేసుకొవచ్చు. డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతా వేదికగా తొలిసారి ఐపీఎల్ వేలం జరుగుతుంది. ఈ వేలంలో మొత్తం 332 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో కనీస ప్రాథమిక ధర రూ. 2 కోట్లుగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, స్టెయిన్, మాథ్యూస్, మోరిస్‌లపై అందరి దృష్టి నెలకొని ఉంది.

Story first published: Saturday, December 14, 2019, 15:57 [IST]
Other articles published on Dec 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X