న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: చాహల్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదిన యువరాజ్ (వీడియో)

IPL 2019 : Yuvraj Singh Turns Back With Hat-Trick Of Sixes || Oneindia Telugu
IPL 2019: Yuvraj Singh Takes Fans on a Nostalgia Ride, Smashes Yuzvendra Chahal For Hat-Trick Sixes

హైదరాబాద్: యువరాజ్ సింగ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన సంఘటనే. యువరాజ్ సింగ్ సిక్సులు బాదితే చూడాలని ప్రతి అబిమాని కోరుకుంటాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో చెలరేగాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (23: 12 బంతుల్లో 3 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో తొలి మూడు బంతుల్ని వరుసగా 6, 6, 6‌గా మలిచిన యువరాజ్.. నాలుగో బంతిని కూడా సిక్స్‌గా తరలించే ప్రయత్నంలో ఔటయ్యాడు.

సిరాజ్ చేతికి చిక్కి పెవిలియన్‌కు చేరిన యువరాజ్

బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ మహ్మద్ సిరాజ్ చేతికి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. తొలుత ముంబై ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. దీంతో 13 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. తొలుత కొన్ని బంతులు విడిచిపెట్టిన యవరాజ్... చాహల్ బౌలింగ్‌లో ఒక్కసారిగా రెచ్చిపోయాడు.

డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా మొదటి బంతిని సిక్స్‌గా

డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా మొదటి బంతిని సిక్స్‌గా మలిచిన యువరాజ్... రెండో బంతిని బౌలర్‌ తలపై నుంచి సిక్సుగా మలిచాడు. అనంతరం మూడో బంతిని లాంగ్‌ ఆన్‌ దిశగా హ్యాట్రిక్‌ సిక్స్‌ బాదాడు. యువీ సిక్సర్ల వర్షానికి గ్యాలరీ అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఈ క్రమంలో నాలుగో బంతిని లాంగ్‌ ఆఫ్‌లో సిరాజ్‌ అద్భుత క్యాచ్‌ పట్టడంతో యువీ నిరాశగా వెనుదిరిగాడు.

6 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం యువీ మాట్లాడుతూ "ఈ ఐపీఎల్‌కు బాగా సన్నద్ధమయ్యా. గడిచిన రెండు, మూడు నెలల నుంచి ముంబwలో ప్రాక్టీస్‌ చేస్తూ డీవై పాటిల్‌ టోర్నీలో ఆడా. ఐపీఎల్‌ ఆడే ఆటగాళ్లకు ఈ టోర్నీ చాలా ముఖ్యం. అలాగే ఫిట్‌నెస్‌పైనా దృష్టి సారించా" అని చెప్పాడు.

యువీ సిక్స్‌ కొడితే యావత్‌ దేశం సంబరపడుతుంది

"కోహ్లీ సిక్స్‌ కొడితే ఆర్సీబీ సంబరపడుతుంది. రోహిత్‌ సిక్స్‌ కొడితే ముంబై సంబరపడుతుంది. కానీ యువీ సిక్స్‌ కొడితే యావత్‌ దేశం సంబరపడుతుంది" అని కొందరు సోషల్ మీడియాలో ట్వీట్‌ చేస్తున్నారు.

Story first published: Friday, March 29, 2019, 15:13 [IST]
Other articles published on Mar 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X