న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్ నుంచి ధోని వరకు: ఒంటి చేత్తో సిక్స బాదారిలా!(వీడియో)

IPL 2019 : MS Dhoni's One Handed Six During Chennai Super Kings V Delhi Capitals Match || Oneindia
IPL 2019: WATCH – MS Dhoni smacks one-handed six off Chris Morris’ nasty beamer

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లీగ్ దశను పూర్తి చేసుకుని ప్లేఆఫ్ దిశగా సాగుతోంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్ క్రికెట్ అభిమానులకు నిజమైన క్రికెట్ మజాను పంచుతోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో పలువురు ఆటగాళ్లు రికార్డులు నమోదు చేయగా... మరికొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్భుతమైన ఆటతీరుని కనబరుస్తున్నాడు. అటు కీపింగ్‌తో పాటు, ఇటు బ్యాటింగ్‌లోనూ చెలరేగుతున్నాడు. ఇక, ధోని కెప్టెన్సీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్‌లో ధోని లేకుండా రెండు మ్యాచ్‌లాడిన చెన్నై రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.

ఒంటి చేత్తో సిక్స్ బాదిన ధోని

దీంతో జట్టులో ధోని ఉండాలంటూ సీఎస్‌కే అభిమాని కోరుకున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన ధోని 358 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఈ సీజన్‌లో స్లాగ్ ఓవర్లలో ధోని మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒంటి చేత్తో సిక్స్ బాదాడు.

ఇన్నింగ్స్ 19వ ఓవర్

ఇన్నింగ్స్ 19వ ఓవర్

క్రిస్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతిని ధోనీ సిక్సర్‌గా మలిచాడు. క్రిస్ మోరిస్ బంతిని యార్కర్ వేయడానికి ప్రయత్నించగా.... అది జారిపోయి నేరుగా ధోనీ భుజాల ఎత్తుకు వెళ్లింది. దీంతో ఆ బంతిని ధోని చూడకుండానే సిక్సర్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్

కాగా, ఈ సీజన్ ఆరంభంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ఇదే తరహాలో సిక్స్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధోని కూడా అదే విధంగా ఒంటి చేత్తో సిక్స్ బాదడంతో ఐపీఎల్ ట్విట్టర్‌లో ఈ వీడియోలను అభిమానులతో పంచుకుంది.

80 పరుగుల తేడాతో ఢిల్లీపై చెన్నై విజయం

80 పరుగుల తేడాతో ఢిల్లీపై చెన్నై విజయం

కాగా, బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ 31 బంతుల్లో44(4ఫోర్లు, 1 సిక్సర్‌) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ధావన్‌(19) పరుగులతో ఫరవాలేదనిపించాడు.

మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోని

మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోని

మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్‌ తాహీర్‌ నాలుగు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా... భజ్జీ, చాహర్ చెరో వికెట్ తీశారు. అంతకముందు సురేశ్ రైనా 37 బంతుల్లో 59(8 ఫోర్లు, సిక్స్), ధోని 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.

Story first published: Thursday, May 2, 2019, 15:06 [IST]
Other articles published on May 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X