న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కారణం వారిద్దరే: ప్లేఆఫ్స్‌లో ఢిల్లీ విజయం సాధించడంపై కెప్టెన్ అయ్యర్

IPL 2019 : Shreyas Iyer Praises Rishabh Pant And Prithvi Shaw For Guiding Delhi Capitals || Oneindia
IPL 2019: Shreyas Iyer praises Rishabh Pant and Prithvi Shaw for guiding Delhi Capitals home in Eliminator

హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో ఓ ప్లేఆఫ్ మ్యాచ్‌లో విజయం సాధించడంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టన్ శ్రేయాస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి విశాఖ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనున్న క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. కాగా, ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్(గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) ప్లేఆఫ్స్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. 2012 ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే ఇప్పటివరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన.

అయ్యర్‌ మాట్లాడుతూ

అయ్యర్‌ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ "నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఆ అనుభూతిని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావట్లేదు. గడిచిన రెండు సంవత్సరాలు ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల్లా అనిపించాయి. ప్రస్తుతం జట్టులోని సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదే ఊపును చెన్నైతో జరగబోయే మ్యాచ్‌లోనూ కొనసాగిస్తాం" అని అన్నాడు.

బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు

బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు

"ఈ పిచ్‌పై మా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. మిడిల్ ఓవర్లలో పరుగులు ఇవ్వకండా చక్కగా కట్టడి చేశారు. అమిత్‌ మిశ్రా కూడా తన అనుభవాన్ని ఉపయోగించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి మా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిశ్రాతో పాటు మిగిలిన బౌలర్లు కూడా రాణించారు" అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఓపెనర్లు భాగస్వామ్యంపై

ఓపెనర్లు భాగస్వామ్యంపై

ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్(17), పృథ్వీ షా (56) పరుగుల భాగస్వామ్యంపై అయ్యర్ స్పందించాడు. "యువ బ్యాట్స్‌మెన్‌ రిషబ్ పంత్‌, పృథ్వీ షా మంచి ఫామ్‌లో ఉన్నారు. వారిద్దరూ ఫామ్‌లో ఉన్నప్పుడు అడ్డుకోవడం ఏ బౌలర్‌కైనా చాలా కష్టమైన పని. వీరిద్దరికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అలాంటప్పుడే వాళ్లు ఆటను ఆస్వాదిస్తారు" అని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.

పంత్, షా ప్రదర్శనపై

అందుకే ఈ మ్యాచ్‌లో పంత్‌, షా ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారని కొనియాడాడు. కాగా, ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్(8) పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయం సాధించింది.

Story first published: Thursday, May 9, 2019, 12:27 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X