రోహిత్ శర్మకు గాయం.. ఆనందోళనలో బీసీసీఐ


టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మకు గాయం అయింది. దీంతో ప్రపంచకప్ ముందు టీమిండియాకు షాక్ తగిలింది. రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది.

ఫీల్డింగ్ చేస్తూ డైవ్ చేయగా:
ముంబై గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై మంచి విజయం సాధించడంతో.. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో కూడా విజయం సాధించి పాయింట్లను పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ముంబై జట్టు ప్రాక్టీస్ షెషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగా రోహిత్ మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ డైవ్ చేయగా.. కుడికాలు కండరాలు పట్టేయడంతో నొప్పితో గ్రౌండ్‌లోనే ఉండిపోయాడు. ముంబై జట్టు వైద్యుడు నితిన్ పటేల్ మైదానంలోకి వచ్చి రోహిత్‌ను తీసుకెళ్లి చికిత్స చేసాడు.

పెద్ద గాయమే:
రోహిత్ గాయం గురించి ముంబై జట్టు యాజమాన్యం ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే రోహిత్‌కు పెద్ద గాయమే అయినట్లు సమాచారం తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నుంచి ఆరు వారాల విశ్రాంతి అవసరమట. రోహిత్ గాయంపై ముంబై యాజమాన్యం నోరువిప్పుతే గాని సమాచారం తెలిసేలాలేదు.

కోలుకునే అవకాశం ఉంది:
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 15న పంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. జూన్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. పంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో.. భారత జట్టులో రోహిత్ కీలక ఆటగాడు రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ ఆందోళన చెందుతోంది. పంచకప్‌కు ఇంకా నెల్లన్నరకు పైగా సమయం ఉంది కాబట్టి ఆలోపు రోహిత్ కోలుకునే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications