న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: రాజస్థాన్‌ రాయల్స్‌ హెడ్ కోచ్‌గా ఆప్టన్‌

IPL 2019: Rajasthan Royals appoint Paddy Upton as their Head Coach

హైదరాబాద్: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ ప్యాడీ ఆప్టన్‌ను తమ ప్రధాన కోచ్‌గా తిరిగి నియమించుకుంది. 2013 నుంచి 2015 ఐపీఎల్ సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్ హెడ్‌ కోచ్‌గా పనిచేసిన ఆప్టన్.. తాను బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే రాజస్థాన్ రాయల్స్ జట్టుని ప్లేఆఫ్‌‌కు చేర్చాడు.

ఆ తర్వాత ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రెండేళ్లు నిషేధం పడగా.. గతేడాదే మళ్లీ ఐపీఎల్‌లోకి ఆ జట్టు పునరాగమనం చేసింది. 2018 ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు నిరాశపరిచింది. బాల్ టాంపరింగ్ కారణంగా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌పై నిషేధం వేటు పడటం... గత సీజన్‌కి దూరమవడం ఆ జట్టు ప్రదర్శనని దెబ్బతీసింది.

ప్రపంచవ్యాప్తంగా పలు జట్లకు కోచ్‌గా

ప్రపంచవ్యాప్తంగా పలు జట్లకు కోచ్‌గా

ఆప్టన్‌ ప్రపంచవ్యాప్తంగా పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌తో పాటు బిగ్‌బాష్, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ల్లోనూ పలు జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆప్టన్‌ మార్గదర్శనంలోనే సిడ్నీ థండర్స్‌ 2016లో బిగ్‌బాష్‌ టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ప్యాడీ ఆప్టన్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తూ ఆదివారం రాజస్థాన్ ప్రాంఛైజీ నిర్ణయం తీసుకుంది.

2008 నుంచి 2011 వరకూ సహాయ కోచ్‌గా

2008 నుంచి 2011 వరకూ సహాయ కోచ్‌గా

దీంతో పాటు భారత్ జట్టుకి కూడా 2008 నుంచి 2011 వరకూ సహాయ కోచ్‌గా ఆప్టన్ పనిచేశాడు. ఈ సమయంలో భారత జట్టు మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌గా విజయవంతమైన పాత్ర పోషించారు. 2011లో భారత జట్టు వరల్డ్ కప్‌ను గెలుచుకోవడంతో పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని సాధించడంలో ఆప్టన్‌ పాత్ర ఎంతో కీలకం.

మార్చి 23 నుంచి ఐపీఎల్

మార్చి 23 నుంచి ఐపీఎల్

దీంతో ఆప్టన్‌ అనుభవం కూడా జట్టుకు అక్కరకొస్తుందని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్టన్‌ మళ్లీ తమ జట్టుతో కలవడం సంతోషంగా ఉందని రాయల్స్‌ సహయజమాని మనోజ్‌ తెలిపారు. కాగా, ఈ ఏడాది మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. మే రెండో వారంలో ముగిసే అవకాశముంది.

Story first published: Monday, January 14, 2019, 9:46 [IST]
Other articles published on Jan 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X