న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్‌కు హిందీలో పాఠాలు నేర్పిస్తున్న ధోని ముద్దుల కుమార్తె (వీడియో)

IPL 2019: MS Dhoni’s daughter Ziva teaches Rishabh Pant hindi vowels in a viral video

హైదరాబాద్: విశాఖ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ అలవోక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఫైనల్‌‌కు చేరుకుంది. ఆదివారం హైదరాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్ జరిగే సమయంలో ధోని ముద్దుల కుమార్తె జీవాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన హావభావాలతో ముద్దు ముద్దు మాటలతో ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకుంది. తాజాగా జీవాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

View this post on Instagram

Back to Basics !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జీవా హిందీ నేర్పిస్తూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని ధోని సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. జీవా చెప్పే హిందీ పాఠాలను రిషబ్ పంత్ శ్రద్ధగా నేర్చుకోవడం గమనార్హం.

ఐపీఎల్ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో చెన్నైపై లీగ్‌ దశలో రెండుసార్లు, క్వాలిఫయర్‌లో ఓసారి మొత్తం మూడు విజయాలతో గణాంకాలను చూస్తే ముంబైకే అవకాశాలున్నాయి.

దీంతో పాటు 2018 నుంచి రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరగ్గా నాలుగింటిలో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. గతంలో చెన్నైతో జరిగిన మూడు ఫైనల్స్‌లోనూ రెండుసార్లు నెగ్గిన జోష్‌తో ముంబై ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే ఊపులో ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బృందం కప్‌ను ఎగరేసుకుపోతుందో? లేక ఈ ఓటములకు ధోని సేన ప్రతీకారం తీర్చుకుంటుందో? చూడాలి.

Story first published: Sunday, May 12, 2019, 12:46 [IST]
Other articles published on May 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X