న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్నస్వామి స్టేడియంలో RCB vs MI: ఎవరు బోణి కొడతారో?

 IPL 2019: Match 7, RCB vs MI Predicted Playing 11, Match Preview & Head to Head Records

హైదరాబాద్: ఐపీఎల్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. భారీ అంచనాలతో ఐపీఎల్‌ 12వ సీజన్‌లో బరిలోకి దిగిన ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూశాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా బోణీ కొట్టాలని ఇరు జట్ల కెప్టెన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గత శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వగా.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పిచ్ నెమ్మదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 17.1 ఓవర్లలో కేవలం 70 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం ఆర్సీబీ నిర్దేశించిన లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీసేన అన్ని విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన చేసింది. దీంతో సొంతగడ్డపై ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. జట్టులో విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ బ్యాటింగ్‌ కీలకం కానుంది.

ఇక, ముంబై విషయానికి వస్తే ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై బౌలర్లు తేలిపోవడం.. రిషబ్ పంత్ చెలరేగడంతో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా వికెట్లు చేజార్చుకుని ఆఖరికి 176కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో వెటరన్ బ్యాట్స్‌మన్ యువీ ఫామ్‌లోకి రావడం సంతోషాన్నిచ్చే విషయం.

బుమ్రా గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడేది ప్రశ్నార్థకంగా మారింది. బుమ్రా స్థానంలో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఆసక్తిగా మారింది. మలింగకు ఐపీఎల్‌లో ఆడేందుకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే ముంబై జట్టులో చేరిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు 23 మ్యాచుల్లో తలపడగా ముంబై 14, బెంగళూరు 9 సార్లు విజయం సాధించాయి.

గేమ్ డిటేల్స్

Date: Thursday, March 28, 2019

Time: 08:00 PM IST

వేదిక: చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు

లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్ వర్క్

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

ఐపీఎల్‌లో ఈ గ్రౌండ్‌లో నమోదైన గణాంకాలు

మొత్తం మ్యాచ్‌లు- 74

తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్‌లు - 30

తొలుత బౌలింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్‌లు- 40

అత్యధిక స్కోరు - 263/5 (20 Ov) by RCB vs PWI

అత్యల్ప స్కోరు - 82/10 (15.1 Ov) by RCB vs KKR

ఛేజ్ చేసిన అత్యధిక పరుగులు- 207/5 (19.4 Ov) by CSK vs RCB

డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోరు - 106/2 (8 Ov) by RCB vs CSK

కీలక ఆటగాళ్లు:

కీలక ఆటగాళ్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ

ఏబీ డివిలియర్స్

షిమోన్ హెట్‌మెయిర్

ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ

క్వింటన్ డీకాక్

హార్దిక్ పాండ్యా

జట్లు అంచనా..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు : విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), పార్థివ్ పటేల్ (వికెట్‌ కీపర్‌), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్‌మేర్‌, శివం దుబే, గ్రాండ్‌హోమ్‌, నవదీప్ సైనీ, యుజువేంద్ర చాహల్, ఉమేశ్‌ యాదవ్, మహమ్మద్ సిరాజ్.

ముంబై ఇండియన్స్‌ : రోహిత్శ ర్మ(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హర్దిక్‌ పాండ్య, క్రుణల్ పాండ్య, బెన్ కట్టింగ్, మిచెల్ మెక్లనగన్‌, రసిఖ్‌ సలామ్, జస్ర్పీత్‌ బుమ్రా, మలింగ

Story first published: Thursday, March 28, 2019, 18:07 [IST]
Other articles published on Mar 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X