న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019: RCB vs RR మ్యాచ్‌లో నమోదైన రికార్డులివే!

 IPL 2019: Match 49, Royal Challengers Bangalore vs Rajasthan Royals – Statistical Highlights

హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇరు జట్ల చెరో పాయింటు లభించింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్‌ 3.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసిన స్థితిలో మళ్లీ వర్షం మొదలైంది. వర్షానికి ముందు 11 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా శాంసన్‌ (28) ఔటయ్యాడు.

లివింగ్‌స్టోన్‌ (11) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వర్షం పడకుండా ఉండి ఉంటే చివరి 10 బంతుల్లో ఫలితం వచ్చేది. ఆర్సీబీ గెలిచి ఉంటే సాంకేతికంగా ప్లేఆఫ్‌ రేసులోనే ఉండేది. అయితే ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో.. మ్యాచ్‌ రద్దవడంతో రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు

ఆ జట్టు చివరి మ్యాచ్‌ గెలిచి, మిగతా మ్యాచ్‌ల ఫలితాలు కలిసొస్తే ముందంజ వేయడానికి అవకాశముండేది. రాజస్థాన్ మిలిగిలిన ఒక మ్యాచ్‌లలో గెలిచినా 13 పాయింట్లు అవుతాయి. 13 పాయింట్లతో ప్లేఆఫ్‌ చేరడం అసాధ్యం. దీంతో రాజస్తాన్‌ 'ప్లేఆఫ్‌' ఆశలు దాదాపుగా మూసుకుపోయాయి.

ఈ మ్యాచ్‌లో నమోదైన గణంకాలివే:

అరుదైన జాబితాలో శ్రేయాస్ గోపాల్

అరుదైన జాబితాలో శ్రేయాస్ గోపాల్

3 - టీ20 ఫార్మాట్‌లో ఒకటి కంటే ఎక్కువ హ్యాట్రిక్ వికెట్లను తీసిన మూడో బౌలర్‌గా శ్రేయాస్ గోపాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో అమిత్ మిశ్రా మూడు హ్యాట్రిక్ వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా... 2009 ఐపీఎల్ ఎడిషన్‌లో యువరాజ్ సింగ్ రెండు హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. శ్రేయాస్ గోపాల్ తన మొదటి హ్యాట్రిక్‌ను సయ్యద్ అలీ ముస్తాక్ అలీ టోర్నీలో తీశాడు.

3 - ఐపీఎల్‌ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు తీసిన మూడవ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ శ్రేయాస్ గోపాల్. 2012 ఐపీఎల్ సీజన్‌లో పూణె వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో అజిత్ చండిల్లా... 2014 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రవీణ్ తాంబ్రే హ్యాట్రిక్ వికెట్లు తీశారు. ఈ ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన సమయంలోనే ఈ ఘనత సాధించారు.

కోహ్లీ, ఏబీని ఔట్ చేసిన గోపాల్

కోహ్లీ, ఏబీని ఔట్ చేసిన గోపాల్

1 - ఒక ఐపీఎల్ గేమ్‌లో ఆర్సీబీ స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లను పెవిలియన్‌కు చేర్చిన మొట్టమొదటి బౌలర్‌గా శ్రేయాస్ గోపాల్ అరుదైన ఘనత సాధించాడు.

5.16 - ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ యావరేజి. ఆ జట్టుపై ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఈ యావరేజిని కలిగి ఉండలేదు. ఆర్సీబీతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో శ్రేయాస్ గోపాల్ 12 వికెట్లు పడగొట్టాడు.

50 వికెట్ల జాబితాలో చాహల్

50 వికెట్ల జాబితాలో చాహల్

50 - ఒకే వేదికలో 50 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆర్సీబీ బౌలర్ యజువేంద్ర చాహల్ చేరాడు. బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ తీయడంతో ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. ఆర్సీబీ తరుపున ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా చాహల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడెలో లసిత్ మలింగ, ఢిల్లీలో అమిత్ మిశ్రా, కోల్‌కతాలో సునీల్ నరేన్‌లు ఒకే వేదికలో 50కిపైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు.

వరుణ్ ఆరోన్ ఖాతాలో చెత్త రికార్డు

వరుణ్ ఆరోన్ ఖాతాలో చెత్త రికార్డు

23 - ఈ మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో రాజస్థాన్ బౌలర్ వరుణ్ ఆరోన్ సమర్పించుకున్న పరుగులు. తద్వారా ఐపీఎల‌్‌లో ఓ బౌలర్ మొదటి ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మూడో మ్యాచ్ ఇది. 2011 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 27... 2013 ఐపీఎల్ ఎడిషన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి.

Story first published: Wednesday, May 1, 2019, 16:03 [IST]
Other articles published on May 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X