న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో KKR vs SRH: టాస్ గెలిచిన కోల్‌కతా, సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువీ

IPL 2019 : Toss Won By Kolkata Knight Riders | Oneindia Telugu
IPL 2019, Live Cricket Score, KKR vs SRH at Kolkata: KKR Opt to Bowl, Bhuvneshwar to Lead SRH

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి మ్యాచ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల టెస్టు మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో అతడి స్థానంలో భువనేశ్వర్‌కు పగ్గాలు అప్పజెప్పారు. దాంతో ఐపీఎల్‌లో భువీ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

భుజం గాయం కారణంగా విలియమ్సన్‌ సన్‌రైజర్స్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. విలియమ్సన్‌కు గాయం పెద్దది కాకపోయినప్పటికీ విలియమ్సన్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పరాజయం పాలైంది. కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గత ఆరు సీజన్లుగా వరుసగా ప్రతీ ప్రారంభ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తూ వస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును కొనసాగిస్తుందో, లేదో వేచి చూడాల్సిందే.

1
45758

సొంతగడ్డపై బోణి కొట్టాలని కోల్‌కతా

మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతగడ్డపై బోణి కొట్టాలని ఆశిస్తోంది. సొంతగడ్డపై వేలాది మంది అభిమానుల మధ్య సత్తాచాటేందుకు సిద్ధమైంది. ఆ జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్, క్రిస్‌లిన్, బ్రాత్‌వైట్, ఆండ్రీ రసెల్‌ తదితర హిట్టర్లతో కళకళలాడుతోంది. అయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం బౌలింగ్ అనే విషయం తెలిసిందే. బలబలాల పరంగా చూస్తే రెండు జట్లు దాదాపు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి.

ఈ రెండు జట్లూ 15సార్లు తలపడగా

ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లూ 15సార్లు తలపడగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరింట విజయం సాధించింది. 2018 ఐపీఎల్‌ సీజన్‌‌లో మూడు సార్లు (లీగ్‌ దశలో రెండు సార్లు, ఎలిమినేటర్ మ్యాచ్) ఢీకొనగా.. లీగ్ తొలి మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్.. ఆ తర్వాత రెండో మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కి చేరింది.

రెండు సార్లు టైటిల్ నెగ్గిన నైట్ రైడర్స్

2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 11 సీజన్లు ముగియగా.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మూడేసి సార్లు టైటిల్ గెలిచాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు, రాజస్థాన్ రాయల్స్ , డక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

టైటిల్ కొట్టాలనే కసితో సన్‌రైజర్స్

గత సీజన్‌లో ఫైనల్లో చెన్నై చేతిలో ఓటమితో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్.. ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో ఉంది. జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ విలియమ్సన్‌కు తోడు మార్టిన్ గప్టిల్, బెయిర్‌స్టో, యూసుఫ్ పఠాన్, విజయ్ శంకర్, మనీశ్ పాండే లాంటి వారితో బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది. స్వల్ప లక్ష్యాన్ని నిలబెట్టుకోవడంలో సన్‌రైజర్స్ ముందుంటుంది.

జట్ల వివరాలు

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్), ఆండ్రూ రసెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గ్యూసన్, ప్రసీద్ కృష్ణ

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, జాన్ బెయిర్‌స్టో, మనీశ్ పాండే, దీపక్ హుడా, షకీబల్ హసన్, విజయ్ శంకర్, యూసుఫ్ పటాన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్

Story first published: Sunday, March 24, 2019, 16:01 [IST]
Other articles published on Mar 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X