న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్‌పై కోల్‌కతా విజయం.. ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవం

IPL 2019 : Kolkata Knight Riders Defeat Kings XI Punjab By 7 wickets At Mohali || Oneindia Telugu
IPL 2019:KXIP vs KKR: Shubman Gill helps KKR smash KXIP and keep playoff hopes alive

తాజా విజయంతో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఎనిమిదో ఓటమితో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపు బయటికెళ్లిపోయింది. మొహాలీ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. శుభ్‌మన్‌ గిల్‌ (65 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 2×6) చివరి వరకు క్రిజులో ఉండి కోల్‌కతాకు విజయాన్ని అందించాడు.

6 ఓవర్లు.. 62 పరుగులు:

6 ఓవర్లు.. 62 పరుగులు:

184 పరుగుల భారీ లక్ష ఛేదనలో కోల్‌కతాకు శుభ్‌మన్‌, లిన్‌లు మంచి శుభారంభం అందించాడు. బౌండరీలు బాదుతూ.. 6 ఓవర్లలో 62 పరుగులు చేశారు. లిన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు .. ఆండ్రూ టై బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. అయితే అదే ఓవర్‌ చివరి బంతికి మరో భారీ షాట్‌ ఆడబోయి ఔట్‌ అయ్యాడు. అనంతరం క్రిజులోకి వచ్చిన ఉతప్ప (22; 14 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా ఆడడంతో స్కోర్ వేగం పెరిగింది. ఉతప్ప కూడా వేగంగా ఆడే క్రమంలో ఔట్‌ అయ్యాడు.

శుభ్‌మన్‌ అర్ధ సెంచరీ:

శుభ్‌మన్‌ అర్ధ సెంచరీ:

హిట్టర్ రసెల్‌ (24; 14 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి శుభ్‌మన్‌ చెలరేగాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో అతను రెండు సిక్స్‌లు, ఫోర్‌ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రసెల్‌ కూడా కొన్ని భారీ షాట్లు ఆడడంతో నైట్‌రైడర్స్‌ విజయానికి దగ్గరైంది. రసెల్‌ అవుట్ అయినా.. నైట్‌రైడర్స్‌ మూడు ఓవర్లలో 18 పరుగులు చేయాలి. ఇక క్రిజులోకి వచ్చిన కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (21 నాటౌట్‌; 9 బంతుల్లో 2×4, 1×6) రెండు ఫోర్లు, సిక్స్‌ బాది రెండు ఓవర్లు ఉండగానే జట్టును గెలిపించాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శుభ్‌మన్‌ గిల్‌ దక్కించుకున్నాడు.

 ఆదుకున్న నికోలస్ పూరన్:

ఆదుకున్న నికోలస్ పూరన్:

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 13 పరుగుల వద్ద ఓపెనర్ లోకేశ్ రాహుల్ (2) అవుటవగా.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (14) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రిజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (48; 27 బంతుల్లో 3x4, 4x6).. మయాంక్ అగర్వాల్ (36; 26 బంతుల్లో 2x4, 1x6)తో కలిసి స్కోర్ వేగం పెంచాడు. పూరన్ బౌండరీల మోత మోగిస్తూ.. కోల్‌కతా బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పూరన్ పెవిలియన్ చేరగా.. అగర్వాల్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.

చెలరేగిన సామ్‌ కరన్‌:

చెలరేగిన సామ్‌ కరన్‌:

ఇద్దరు అవుటైన తర్వాత స్కోరు వేగం నెమ్మదించింది. ఇన్నింగ్స్ చివర్లో శామ్ కర్రన్ చెలరేగి ఆడడంతో స్కోరు బోర్డు మళ్లీ పరుగులు తీసింది. కరన్‌ (55; 24 బంతుల్లో 7x4, 2x6)కి తోడు మన్‌దీప్‌ సింగ్‌ (25; 17 బంతుల్లో 1x4, 1x6) కూడా చెలరేగి ఆడారు. చివరి ఓవర్‌లో కరన్‌ 22 పరుగులు సాధించి.. అర్ధ శతకం చేసాడు. కరన్‌ అర్ధ శతకం చేయడంతో.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది పంజాబ్.

Story first published: Saturday, May 4, 2019, 7:21 [IST]
Other articles published on May 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X