న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌కు జరిమానా

IPL 2019: Kings XI Punjab captain R Ashwin fined for slow over-rate against Delhi Capitals

ఐపీఎల్‌ సీజన్-12లో జరిమానాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా మరో కెప్టెన్‌ బలయ్యాడు. ఆదివారం డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌కు కారణమైన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్ అశ్విన్‌కుకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ నియమ, నిబంధనలు అనుసరించి లీగ్‌లో తొలిసారి స్లో ఓవర్‌రేట్ కారణమైనందుకు అశ్విన్‌పై జరిమానా విధించాం అని ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ సీజన్‌లో ఓవర్‌రేట్‌ బాధితుడైన నాలుగో కెప్టెన్‌ అశ్విన్‌. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానేలకు జరిమానా పడగా.. తాజాగా అశ్విన్‌ వంతు వచ్చింది. రాత్రి సమయంలో మంచు కురవడంతో బంతిపై పట్టు దొరకకపోవడమే ఈ ఆలస్యానికి కారణం అని విశ్లేషకులు అంటున్నారు.

శనివారం ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన డిల్లీ క్యాపిటల్స్‌.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై మంచి విజయం సాధించి ప్లేఆఫ్స్‌ దిశగా దూసుకెళుతోంది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (69; 37 బంతుల్లో 6×4, 5×6) అర్ధ సెంచరీ చేసాడు. ఢిల్లీ బౌలింగ్‌లో సందీప్‌ లమిచానె (3/40), కాగిసో రబాడ (2/23), అక్షర్‌ పటేల్‌ (2/22)లు రాణించారు. అనంతరం డిల్లీ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్‌ ధావన్‌ 56 (41 బంతుల్లో 7×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ 58 (49 బంతుల్లో 5×4, 1×6) సత్తా చాటారు.

Story first published: Sunday, April 21, 2019, 14:59 [IST]
Other articles published on Apr 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X