న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్వాలిఫయిర్-2లో యూత్ vs ఎక్సీపీరియన్స్: ఫైనల్‌కు వెళ్లేదెవరో!

IPL 2019: Delhi Capitals youth vs wisdom of Chennai Super Kings in battle for final

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడే జట్టు ఏదో తెలిసిపోతుంది. అభిమానులు ఈ మ్యాచ్‌ని యూత్ vs ఎక్సీపీరియన్స్‌గా అభివర్ణిస్తున్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇప్పటివరకు ముగిసిన 11 ఐపీఎల్ సీజన్లు ముగిశాయి. ఈ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. అయితే, ఐపీఎల్ 2018 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వేలంలో దక్కించుకున్న ఆటగాళ్ల వయసు 30కిపైగా ఉంది. దీంతో అభిమానులు ముద్దుగా ఆ జట్టుని డాడీస్ ఆర్మీ అని పిలుచుకునేవారు.

2018 టైటిల్ విజేతగా సీఎస్‌కే

2018 టైటిల్ విజేతగా సీఎస్‌కే

ఇదే డాడీస్ ఆర్మీ 2018 సీజన్‌లో మిరాకిల్ చేసింది. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, డాడీస్ ఆర్మీ ట్రెండ్ ఈ సీజన్‌లోనూ కంటిన్యూ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన సీఎస్‌కే ఈ సీజన్‌లో అద్భుతాలు చేసింది.

వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు

వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు

వరుసగా రెండో సీజన్‌‌లో కూడా ఐపీఎల్ ఫైనల్‌కు చేరేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో తలపడనుంది. ఇక, ఢిల్లీ విషయానికి వస్తే యువ ఆటగాళ్లతో కలకలలాడుతోంది. ఈ సీజన్‌లో యువ క్రికెటర్లు పృథ్వీ షా, రిషబ్ పంత్‌, శ్రేయాస్ అయ్యర్‌లు ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు.

పాంటింగ్ కోచింగ్, గంగూలీ సలహాలు

పాంటింగ్ కోచింగ్, గంగూలీ సలహాలు

పాంటింగ్ కోచింగ్, గంగూలీ సలహాలతో నిర్భయంగా, నమ్మశక్యం కాని రీతిలో షాట్లు ఆడుతున్నారు. కుర్రాళ్లతో నిండిన దిల్లీ ఉత్సాహంతో ఉంది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పై గెలిచిన ఆ జట్టు మరింత ఆత్మవిశ్వాసంతో క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. ఎలిమినేటర్‌లో 21 బంతుల్లోనే 49 పరుగులు చేసి పంత్ ఫామ్‌లో ఉన్నాడు.

పూర్తి ఫినిషింగ్‌కు పంత్

పూర్తి ఫినిషింగ్‌కు పంత్

అయితే, పంత్ పూర్తిస్థాయిలో మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని అటు అభిమానులతో పాటు ఢిల్లీ యాజమాన్యం కోరుకుంటోంది. మరో యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షాతో పాటు శిఖర్‌ ధావన్‌ కూడా ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సంతోషానిస్తోంది. మిడిలార్డర్‌లో అయ్యర్‌, మన్రోలతో ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్ పటిష్టంగా ఉంది.

చరిత్ర సృష్టించాలని ఢిల్లీ

చరిత్ర సృష్టించాలని ఢిల్లీ

కాగా, గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన సఫారీ బౌలర్ కగిసో రబాడ స్థానంలో ట్రెంట్‌ బౌల్ట్‌, ఇషాంత్‌ శర్మ రాణిస్తుండటం... వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అనుభవం జట్టుకు తోడవడం మొత్తంగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఊవిళ్లూరుతోంది.

Story first published: Friday, May 10, 2019, 14:26 [IST]
Other articles published on May 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X