న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: వార్మప్ మ్యాచ్‌లో వార్నర్ హాఫ్ సెంచరీ (వీడియో)

IPL 2019 : David Warner Welt 43-Ball 65 In SRH Practice Match | Oneindia Telugu
David Warner

హైదరాబాద్: మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఇందులో భాగంగా తాజా సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ సొంత మైదానమైన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సీజన్‌లో గడ్డంతో కొత్త అవతారంలో కనిపించిన వార్నర్ వార్మప్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.

గద్దలా ఎగిరిపోయాడు: అభిమానిని ఆట పట్టించిన ధోని (వీడియో)గద్దలా ఎగిరిపోయాడు: అభిమానిని ఆట పట్టించిన ధోని (వీడియో)

బాల్ టాంపరింగ్‌‌ ఘనటతో గత సీజన్ మొత్తానికి డేవిడ్ వార్నర్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే వార్నర్‌పై ఉన్న నిషేధం మార్చి 28తో ముగియనుండగా.. ఐపీఎల్‌లో రీఎంట్రీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్ మైదానంలో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 65 పరుగులతో చెలరేగాడు.

జట్టులోని ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి సన్నాహక మ్యాచ్ ఆడారు. సన్‌రైజర్స్ 'ఎ' జట్టుకి ఆడిన వార్నర్ మెరుపు అర్ధశతకం బాదేశాడు. అతనితో పాటు మనీశ్ పాండే కూడా 43 బంతుల్లో 67 పరుగులు, దీపక్ హుడా 27 బంతుల్లో 55 పరుగులు చేయడంతో 'ఎ' జట్టు రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

ఇటీవల మోచేతి గాయం కారణంగా కొన్నిరోజులు ప్రాక్టీస్‌కి దూరంగా ఉన్న వార్నర్.. ప్రాక్టీస్ మ్యాచ్‌తో ఫిట్‌నెస్‌ని కూడా నిరూపించుకున్నాడు. కోచ్ టామ్ మూడీ, సహాయ సిబ్బంది పర్యవేక్షణలో బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ సాధన చేయగా.. బౌలర్లు బంతులు వేశారు. ఛేదనలో యూసఫ్ పఠాన్, రికీ భుయ్, హాఫ్ సెంచరీలు సాధించడంతో 18.1 ఓవర్లలోనే సన్‌రైజర్స్ 'బి' టీమ్ విజయం సాధించింది.

దులో రికీభుయ్ 29 బంతుల్లోనే 65 పరుగులు చేయడం విశేషం. టోర్నీలో భాగంగా మార్చి 24న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో ఆడుతుంది. ఇక, మార్చి 29న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

Story first published: Monday, March 18, 2019, 17:44 [IST]
Other articles published on Mar 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X