న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో గెలిచేదెవరు?: ప్రివ్యూ, ఎక్కడ చూడాలి

IPL 2019 : CSK vs RCB Match Preview !! | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌కి చెపాక్‌లోని ఎమ్.ఎ చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటివరకు ముగిసిన పదకొండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్ విజేతగా నిలవగా... ఆర్సీబీ ఒక్కసారిగా కూడా టైటిల్‌ను గెలవలేదు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ మొదలవుతుందంటే చాలు... ఏ జట్టు బలమెంత అని చూస్తారు అభిమానులు. జట్టులోని ఆటగాళ్లను బట్టి దానికి టైటిల్‌ గెలిచే సత్తా ఉందా లేదా అని విశ్లేషిస్తారు. అయితే, చెన్నై విషయానికి వస్తే మాత్రం.. జట్టులో ఎవరెవరున్నారు.. ఆ జట్టు బలం ఎంత అని విశ్లేషించే పరిస్థితి ఉండదు. కారణం ఆ జట్టు కెప్టెన్ ధోని కాబట్టి. ఐపీఎల్‌లో.. కెప్టెన్లందు ధోని వేరు.. ఎందుకంటే జట్టు ఎలాగైనా ఉండనీ... జట్టుని మాత్రం లీగ్‌ దశ నుంచి దాటించేస్తాడు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్టే. ఎందుకంటే ఈసారి ఢిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది కాబట్టి. ఆడిన తొమ్మిది సీజన్లలో మూడుసార్లు టైటిల్‌ గెలవడం, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ గెలవలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ఫైనల్‌ చేరినా ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవలేకపోయిన జట్టు ఏదైనా ఉంటే అది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరే. తొలి సీజన్లో పేలవ ప్రదర్శన తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్‌ చేరిన ఆ జట్టు త్రుటిలో టైటిల్‌కు దూరమైంది. 2011, 2016 సీజన్లలో సైతం అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్‌కి చేరినప్పటికీ... ఫైనల్లో బోల్తా కొట్టింది. దీంతో ఈసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నా.. కెప్టెన్‌గా జట్టుని విజయపథంలోకి నడిపించలేకపోతున్నాడు. ఈ ఐపీఎల్‌ను కోహ్లీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్‌), రైనా, రాయుడు, మురళీ విజయ్‌, కేదార్‌ జాదవ్‌, హర్భజన్‌ సింగ్‌, జడేజా, మోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, కర్ణ్‌ శర్మ, ధ్రువ్‌ షోరే, దీపక్‌ చాహర్‌, నారాయణ్‌ జగదీశన్‌, రితురాజ్‌ గైక్వాడ్‌, కేఎం అసిఫ్‌, మోను కుమార్‌, చైతన్య బిష్ణోయ్‌, డుప్లెసిస్‌, డ్వేన్‌ బ్రావో, షేన్ వాట్సన్‌, బిల్లింగ్స్‌, శాంట్నర్‌, డేవిడ్‌ విల్లీ, తాహిర్‌.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), ఉమేశ్‌, చాహల్‌, పార్థివ్‌, పవన్‌ నేగి, గుర్‌కీరత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, శివమ్‌ దూబె, నవ్‌దీప్‌ సైని, అక్ష్దీప్‌నాథ్‌, మిలింద్‌ కుమార్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, హిమ్మత్‌, కుల్వంత్‌ ఖెజ్రోలియా, ప్రయాస్‌ బర్మన్‌, డివిలియర్స్‌, స్టాయినిస్‌, మొయిన్‌ అలీ, కౌల్టర్‌నైల్‌, హెట్‌మయర్‌, సౌథీ, గ్రాండ్‌హోమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఉమేశ్‌ యాదవ్, మొయిన్‌ అలీ, యజువేంద్ర చాహల్‌

మ్యాచ్‌ని ఎక్కడ చూడాలి

మ్యాచ్‌ని ఎక్కడ చూడాలి

ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు.

Story first published: Friday, March 22, 2019, 15:43 [IST]
Other articles published on Mar 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X