న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: చెన్నై జట్టుకు యోయో టెస్టు లేదు, మరి ఫిట్‌నెస్!

IPL 2019 : No Yo-Yo Test For Chennai Super Kings Players | Oneindia Telugu
IPL 2019: Chennai Super Kings players not to undergo Yo-Yo Test to prove fitness

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో బరిలోకి దిగే అన్ని జట్లతో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 30 ప్లస్ యూత్ ఎక్కువగా ఉన్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(37 ఏళ్లు) మొదలుకుని బ్రావో (35), డుప్లెసిస్‌ (34), హర్భజన్‌ (38), అంబటి రాయుడు (33), మురళీ విజయ్‌ (34), షేన్ వాట్సన్‌ (37), కేదార్ జాదవ్‌ (33), ఇమ్రాన్ తాహిర్‌ (39 ఏళ్లు) ఇలా జట్టులో ఎక్కువ మంది ముప్ఫైకి పైబడిన వారే ఉండటం విశేషం.

న్యూజిలాండ్‌లో ఉగ్రదాడి: మెక్‌కల్లమ్ నుంచి రోహిత్ వరకు ఎవరేమన్నారు?న్యూజిలాండ్‌లో ఉగ్రదాడి: మెక్‌కల్లమ్ నుంచి రోహిత్ వరకు ఎవరేమన్నారు?

ఫిట్‌నెస్‌ పరంగా చూస్తే

ఫిట్‌నెస్‌ పరంగా చూస్తే

వీరంతా కూడా గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించినప్పటికీ, ఫిట్‌నెస్‌ పరంగా చూస్తే అంతంత మాత్రమే. వీరికి యోయో టెస్టు నిర్వహిస్తే తప్పకుండా ఫెయిల్ అవుతారు. బహుశా ఇదే కారణంతో చెన్నై యాజమాన్యం తమ ఆటగాళ్లకు యోయో టెస్టు ఉండదని అధికారిక ప్రకటన చేసింది.

యోయో టెస్టు తప్పనిసరి

యోయో టెస్టు తప్పనిసరి

నిజానికి, భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే యోయో టెస్టు తప్పనిసరి. గతంలో అంబటి రాయుడు యోయో టెస్టులో ఫెయిల్ అయిన కారణంగా సిరిస్‌కు ఎంపికైనప్పటికీ ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. తాజాగా, చెన్నై ఆటగాళ్లకు యోయో తప్పనిసరి కాదని, ఫ్రాంచైజీకి తొలి సీజన్‌ను నుంచి సేవలు అందిస్తున్న టీమిండియా మాజీ ట్రైనర్‌ రాంజీ శ్రీనివాసన్‌ తెలిపారు.

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ నిర్ధారించేందుకు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ నిర్ధారించేందుకు

త్వరలో ప్రారంభమవుతున్న సీజన్‌ కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ నిర్ధారించేందుకు యోయోకు బదులుగా 2 కి.మీ లేదా 2.4 కి.మీ పరుగు, స్ర్పింట్‌ రిపీట్‌ పరీక్షను నిర్వహిస్తున్నామని రాంజీ వెల్లడించారు. అందరిలా యోయో పరీక్ష కాకుండా ఆటగాళ్లను వ్యక్తిగతంగా దృష్టిలో ఉంచుకొని దృఢత్వ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాంజీ తెలిపారు.

కోహ్లీ చేసే ఎక్స్‌ర్‌సైజ్‌లు మరొకరికి సాధ్యం కాకపోవచ్చు

కోహ్లీ చేసే ఎక్స్‌ర్‌సైజ్‌లు మరొకరికి సాధ్యం కాకపోవచ్చు

"బోల్ట్‌ స్ప్రింట్‌ చేస్తే నేను కూడా అదే చేయాలని లేదు. కోహ్లీ చేసే ఎక్స్‌ర్‌సైజ్‌లు మరొకరికి సాధ్యం కాకపోవచ్చు. అందరు ఆటగాళ్లు భిన్నంగా ఉంటారని తెలుసుకోవాలి. కాబట్టి యోయో అందరికీ అవసరం లేదని గుర్తించాం" అని ఆయన అన్నారు. ఒకప్పుడు టీమిండియాకు పనిచేస్తున్నప్పుడూ తాను ధోనీకి, సచిన్‌‌కు వేర్వేరు కసరత్తులు చేయించేవాడినని తెలిపారు.

ఫుట్‌బాల్‌ తరహా ఏరోబిక్‌ క్రీడలకు యోయో

ఫుట్‌బాల్‌ తరహా ఏరోబిక్‌ క్రీడలకు యోయో

"కోహ్లీ ఎత్తుతున్న అధిక బరువులకు అతడి శరీరం సానుకూలంగా స్పందిస్తే పర్వాలేదు. అతడు చేస్తున్నాడని ధోని కచ్చితంగా అదే కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. ఫుట్‌బాల్‌ తరహా ఏరోబిక్‌ క్రీడలకు యోయో సరిపోతుంది. ఫిట్‌నెస్‌ విషయంలో ఒక సమగ్ర దృక్పథం అవసరం. ధోనీ సాధారణంగా క్లీన్‌ అండ్‌ జెర్క్‌ తరహా పవర్‌ లిఫ్టింగ్‌ ఇష్టపడడు. సాధారణంగా ఉండి, అతడి నైపుణ్యాలను పెంచే కసరత్తులు ఎంచుకుంటాడు" అని చెప్పాడు.

Story first published: Saturday, March 16, 2019, 10:40 [IST]
Other articles published on Mar 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X