న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రసెల్‌ ఆటతీరుపై హేల్స్‌ అసంతృప్తి...

IPL 2019: Alex Hales not impressed with Andre Russell not giving the strike to Harry Gurney

వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు ఆటగాడు ఆండ్రీ రసెల్‌ ఆటతీరుపై ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. చెన్నై వేదికగా మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పిచ్ నెమ్మదిగా ఉండడంతో.. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా ఆటగాళ్లు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు క్యూ కట్టారు. 79 పరుగుల వద్ద కోల్‌కతా 9వ వికెట్ కోల్పోయింది. క్రీజులోకి గర్నీ వచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గర్నీ సహాయంతో ఆండ్రీ రసెల్‌ 50 (44 బంతుల్లో; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధ సెంచరీ చేసి కోల్‌కతా స్కోరును 100 పరుగులు దాటించాడు. ఈ జోడి 29 పరుగుల బాగస్వామ్యంను నెలకొల్పింది. ఇందులో గర్నీ 5 బంతులు ఆడి 1 పరుగు చేసాడు. అయితే చాలాసార్లు గర్నీకి సింగిల్‌ తీసే అవకాశం వచ్చినా.. రసెల్‌ పరుగు తీసేందుకు నిరాకరించాడు. దీంతో రసెల్‌ ఆటతీరుపై ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. తక్కువ స్కోరింగ్‌ మ్యాచులలో ప్రతి పరుగూ కీలకమే. టెయిలెండర్లకు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలి, వారి బ్యాటింగ్‌ సామర్థ్యంను గమనించాలి. గర్నీ ఆన్‌డ్రైవ్‌ షాట్లను రసెల్‌ చూస్తే ఇలా చేసి ఉండేవాడు కాదేమో?' అని హేల్స్‌ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Story first published: Wednesday, April 10, 2019, 16:53 [IST]
Other articles published on Apr 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X