న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: గంభీర్ 'చురుకైన కెప్టెన్ కాదు' వ్యాఖ్యలపై ఘాటుగా రిప్లై ఇచ్చిన కోహ్లీ

IPL 2019 : Royal Challengers Bangalore Captain Virat Kohli Gives A Fitting Reply To Gautam Gambhir
IPL 2019: Ahead of RCB opener vs CSK, Virat Kohli gives fitting reply to Gautam Gambhirs captaincy jibe

హైదరాబాద్: "ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఏమంత చురుకైన కెప్టెన్ కాదు" అని రెండు రోజుల క్రితం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఐపీఎల్‌ టైటిల్‌ను ఒక్కసారి కూడా గెలవకపోయినా ఆర్సీబీ యాజమాన్యం... కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలంటూ గంభీర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్ శనివారం నుంచి ప్రారంభంకానుండగా.. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో శనివారం రాత్రి 8 గంటలకి చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గంభీర్ వ్యాఖ్యల ప్రస్తావన

గంభీర్ వ్యాఖ్యల ప్రస్తావన

ఈ నేపథ్యంలో.. మీడియాతో విరాట్ కోహ్లీ మాట్లాడుతుండగా గంభీర్ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. కోహ్లీ మాట్లాడుతూ "ఐపీఎల్ టైటిల్ గెలవాలని నేనూ కోరుకుంటున్నాను. దానికోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా. కానీ.. కేవలం ఐపీఎల్‌ టైటిల్ ఆధారంగా నా సామర్థ్యాన్ని అంచనా వేయడాన్ని ఒప్పుకోను" అని కోహ్లీ అన్నాడు.

ఎటువంటి ప్రమాణాలు లేవు

ఎటువంటి ప్రమాణాలు లేవు

"నిజానికి ఒక క్రీడాకారుడి ప్రతిభను అంచనా వేయడానికి ఎటువంటి ప్రమాణాలు లేవు. ప్రతిసారీ టైటిల్ గెలవాలనే కోరుకుంటా. కానీ.. అన్నిసార్లూ అది సాధ్యంకాకపోవచ్చు. నాకు సాధ్యమైనంత వరకు గెలవడానికే ప్రయత్నిస్తా. నా కెరీర్‌లో ఎన్ని టైటిల్లు గెలవాలని భావిస్తానో అన్నీ గెలిచి తీరతాను" అని కోహ్లీ చెప్పాడు.

ఇలా విమర్శలతో వార్తల్లో నిలవాలని

"అయితే కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. బయటవాళ్లలా నేనూ ఆలోచిస్తే.. ఐదు మ్యాచ్‌లు కూడా ఆడకుండానే.. ఇంట్లో కూర్చుంటాను. చాలా మంది ఇలా విమర్శలతో వార్తల్లో నిలవాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. కానీ.. నాకంటూ ఓ బాధ్యత ఉంది. ఒక జట్టు కెప్టెన్‌గా.. ఐపీఎల్‌ టైటిల్‌ను జట్టుకి అందించాలని కోరుకుంటున్నా. ఆ ప్రేరణతోనే ఈసారి కూడా బరిలోకి దిగుతున్నాం" అని కోహ్లీ వెల్లడించాడు.

Story first published: Saturday, March 23, 2019, 14:22 [IST]
Other articles published on Mar 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X