న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు ఆడాలని ఉంది: రెండో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' తర్వాత నితీష్ రాణా

By Nageshwara Rao
IPL 2018: Want to play for India, says Nitish Rana after winning second consecutive Man of the Match award for KKR

హైదరాబాద్: నితీష్ రాణా... ఐపీఎల్ 11వ సీజన్‌లో ప్రముఖంగా వినిపిస్తోన్న యువ క్రికెటర్. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కోల్‌కతా తరుపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే వరుస బంతుల్లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

తాజాగా, బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా 11 పరుగులిచ్చి రాజస్థాన్ ఓపెనర్లు రహానే(36: 19 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సు)తో పాటు డీఆర్క్‌ షార్ట్ (44: 43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు)లను పెవిలియన్‌కు చేర్చాడు.

ఆ తర్వాత బెంగళూరుపై దుమ్మురేపిన శాంసన్‌ (7) శివమ్‌ మావి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఊపు మీదున్న షార్ట్‌ 12వ ఓవర్‌లో వరుసగా 6,4తో ఆకట్టుకున్నాడు. కానీ 13వ ఓవరల్‌ రాణా అతడిని బౌల్డ్‌ చేయగా మరుసటి ఓవర్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌.. త్రిపాఠి (15) పెవిలియన్‌కు చేర్చాడు.

బెన్ స్టోక్స్‌ (14) మరోసారి నిరాశపరచగా చివర్లో బట్లర్‌ (24 నాటౌట్‌) రాణించడంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఆ తర్వాత 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 70/2తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన రాణా (35 నాటౌట్: 27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సు)తో చివరి వరకూ క్రీజులో జట్టుని గెలిపించాడు.

17వ ఓవర్‌లో దినేశ్‌ కార్తీక్‌, రాణా చెరో సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కి అజేయంగా 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో 18 బంతుల్లో 19 పరుగులు రావాల్సి ఉండగా మరో ఏడు బంతులు మిగలుుండగానే కోల్‌కతా ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన నితీశ్ రానాకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

ఈ సందర్భంగా రాణా మాట్లాడుతూ 'ఐపీఎల్ 2018 సీజన్‌లో నా ప్రదర్శన వెనుక భారత జట్టుకి ఆడాలనే ఆశ ఉంది. టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కడం నా అదృష్ట‌ం. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ జట్టుని తక్కువ పరుగులకి కట్టడి చేయడం నా బాధ్యతగా భావించాను. అందుకే.. జాగ్రత్తగా లయ తప్పకుండా బౌలింగ్ చేశా. దేశవాళీ క్రికెట్‌లో నేను రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తుంటా' అని వెల్లడించాడు.

Story first published: Thursday, April 19, 2018, 12:33 [IST]
Other articles published on Apr 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X