Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రియాన్ పరాగ్‌కు జైలు శిక్ష?

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. తాజాగా ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కడం పెనుదుమారం రేపుతోంది. మంగళవారం రాత్రి ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 16వ ఓవర్లో రియాన్ పరాగ్ తన చేతిలో వేపింగ్ డివైజ్ పట్టుకొని ఉండటం లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో స్పష్టంగా కనిపించింది. ఇది బీసీసీఐ నిబంధనలనే కాకుండా భారత చట్టాలను కూడా ఉల్లంఘించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

బీసీసీఐ నిబంధనల ప్రకారం.. డ్రెస్సింగ్ రూమ్, స్టేడియం ప్రాంగణంలో ధూమపానం పూర్తిగా నిషేధించబడింది. కేవలం నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే అందుకు అనుమతి ఉంటుంది. అయితే రియాన్ పరాగ్ వాడిన ఈ-సిగరెట్ విషయంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. భారత ప్రభుత్వం 2019లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) కింద వీటి ఉత్పత్తి, అమ్మకం, కొనుగోలు, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఇది కేవలం క్రీడా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాకుండా, నేరంగా పరిగణించబడే ప్రమాదం ఉంది.

Riyan Parag Facing Jail Rajasthan Royals Captain Caught Vaping in Dressing Room During IPL 2026

ఈ విషయంలో బీసీసీఐ చాలా కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. "వేపింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏ పదార్థాన్ని లోపలికి తీసుకుంటున్నారో తెలియదు, ఇది ఆరోగ్యానికి, భద్రతా ప్రమాణాలకు విరుద్ధం. ముఖ్యంగా ఓ ప్రొఫెషనల్ ఆటగాడు ఇలా చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు" అని బోర్డు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని రియాన్ పరాగ్, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందే జట్టు మేనేజర్ రోమీ భిందర్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించి నిబంధనలు ఉల్లంఘించినందుకు బీసీసీఐ ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఇప్పుడు స్వయంగా కెప్టెనే ఇలాంటి వివాదంలో దొరికిపోవడం జట్టు ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఒకవేళ విచారణలో రియాన్ పరాగ్ తప్పు చేసినట్లు తేలితే.. అతడు భారీ జరిమానాతో పాటు నిషేధాన్ని లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Story first published: Wednesday, April 29, 2026, 14:52 [IST]
Other articles published on Apr 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+