Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడు ఇలానే ఆడితే క్రిస్ గేల్ రికార్డు బద్దలైపోద్ది..!

IPL 2026 సీజన్ సిక్సర్ల సునామీతో దూసుకుపోతోంది. గత ఏడాది నమోదైన 1294 సిక్సర్ల రికార్డు ఈసారి కచ్చితంగా బద్దలయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ రికార్డులకే సవాల్ విసురుతున్నాడు. సూర్యవంశీ ఆడుతున్న తీరు చూస్తుంటే ఈ సీజన్‌లో సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

అతను కేవలం తొమ్మిది ఇన్నింగ్స్‌లోనే 37 సిక్సర్లు బాది 400 పరుగులతో టాప్ రన్-గెట్టర్‌గా కొనసాగుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న సూర్యవంశీ, ఆ మ్యాచ్‌లో 12 సిక్సర్లు కొట్టి మురళీ విజయ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

Vaibhav Sooryavanshi might surpass Chris Gayle record for hitting the most sixes in a season

ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ 37 సిక్సర్లతో అందరికంటే ముందుండగా, అభిషేక్ శర్మ (28), ప్రియాంశ్ ఆర్య (26), రజత్ పాటిదార్ (23), శ్రేయాస్ అయ్యర్ (22) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. గతంలో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయుడిగా అభిషేక్ శర్మ (2024లో 42 సిక్సర్లు) రికార్డు సృష్టించగా, సూర్యవంశీ ఆ మార్కును దాటేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ 2012లో 59 సిక్సర్లు బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా, ఆండ్రీ రస్సెల్ 2019లో 52 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

వరుసగా రెండు సీజన్లలో 50కి పైగా సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా గేల్ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. బట్లర్, నికోలస్ పూరన్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు కూడా వివిధ సీజన్లలో భారీగా సిక్సర్లు బాదిన వారి జాబితాలో ఉన్నారు. ప్రస్తుత వేగం చూస్తుంటే, ఈ ఏడాది వైభవ్ సూర్యవంశీ క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డును చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Story first published: Wednesday, April 29, 2026, 16:38 [IST]
Other articles published on Apr 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+