Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడు మామూలోడు కాదు.. భయ్యా భయ్యా అంటూనే 35 దంచిండు: స్టార్ బౌలర్

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవల పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లలో వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

షాకింగ్ కామెంట్స్ చేసిన అర్ష్‌దీప్ సింగ్
మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది.ఆ వీడియోలో అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్‌తో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "ఈ వైభవ్ బయట మాట్లాడేటప్పుడు 'భయ్యా.. భయ్యా' అంటూ ఎంతో మర్యాదగా ఉంటాడు, కానీ మైదానంలోకి దిగాక మాత్రం ఆ మర్యాదను పక్కన పెట్టి 35 పరుగులు బాదేస్తాడు" అని అర్ష్‌దీప్ సింగ్ నవ్వుతూ తన బాధను చెప్పుకున్నాడు. మైదానంలో వైభవ్ చూపించే దూకుడు గురించి అర్ష్‌దీప్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Arshdeep Singh Viral Comment on Vaibhav Suryavanshi Batting Says Bhaiya Bhaiya but Hits 35 Runs

ధోనీని గుర్తుకు తెచ్చిన హెలికాప్టర్ షాట్
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మొదటి ఓవర్‌లోనే వరుసగా సిక్సర్లు, ఫోర్లు బాది పంజాబ్ బౌలింగ్‌ను కకావికలం చేశాడు. ముఖ్యంగా అర్ష్‌దీప్ బౌలింగ్‌లో వైభవ్ కొట్టిన 'హెలికాప్టర్ షాట్' ధోనీని గుర్తుకు తెచ్చిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. రాజస్థాన్ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో వైభవ్ ఇచ్చిన మెరుపు ఆరంభం ఎంతో దోహదపడింది.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఫామ్ చూస్తుంటే ఈ సీజన్‌లో అతను మరిన్ని రికార్డులు సృష్టించేలా కనిపిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ చేసిన తర్వాత.. అదే జోరును పంజాబ్‌పై కూడా కొనసాగించడంతో రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం తమ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, April 29, 2026, 14:27 [IST]
Other articles published on Apr 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+