మనల్ని ఎవడ్రా ఆపేది.. భయం అనేది డిక్షనరీలోనే లేదు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఈ సీజన్లో 400 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో కేవలం 167 బంతుల్లోనే 400 పరుగులు పూర్తి చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా (238.09 స్ట్రైక్ రేట్‌తో) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. "వైభవ్ కొడుతున్న షాట్లు అద్భుతం. అతని కోసం బౌండరీ లైన్ వద్ద 10 మంది ఫీల్డర్లను పెట్టినా ఆపడం అసాధ్యం. అతను దేనికీ భయపడటం లేదు. ఇంత చిన్న వయసులో ఉండటం వల్ల వచ్చే ప్రయోజనం అదే కాబోలు. ఎదురుగా ఉన్నది ఏ బౌలర్ లేదా ఏ జట్టు అని అతను ఆలోచించడం లేదు, కేవలం బంతిని మాత్రమే చూస్తున్నాడు" అని కొనియాడారు. వైభవ్ దూకుడు ఐపీఎల్‌లోని మిగిలిన జట్లకు పెద్ద సవాల్‌గా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన ఆరంభం ఎంతో కీలకంగా మారింది. పంజాబ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే 6, 4, 4 బాది వైభవ్ సూర్యవంశీ తన ఉద్దేశాన్ని చాటాడు. లాకీ ఫెర్గూసన్, మార్కో జాన్సెన్ వంటి మేటి బౌలర్లను కూడా లెక్కచేయకుండా భారీ సిక్సర్లు బాదాడు. కేవలం 3.2 ఓవర్లలోనే రాజస్థాన్ 50 పరుగుల మార్కును దాటడం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసానికి నిదర్శనం.
చివరికి డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే అద్భుతమైన పోరాటంతో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ (51), రియాన్ పరాగ్ (29) కూడా రాణించడంతో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో తమ మొదటి ఓటమిని చవిచూసింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజాల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, పరుగుల వేటలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications