Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ బాడీలో 'AI చిప్'? పాక్ నిపుణుడికి బుడ్డోడి మాస్ రిప్లై!

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు కూడా పాకింది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లోనే 238.09 కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌తో 400 పరుగులు బాదిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్ వంటి మేటి బౌలర్ల బౌలింగ్‌లో కూడా ఏ మాత్రం భయం లేకుండా బంతిని గాల్లోకి లేపుతున్న తీరు చూసి క్రికెట్ ప్రపంచం విస్తుపోతోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన క్రికెట్ నిపుణుడు నౌమాన్ నియాజ్ వైభవ్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

పాక్ నిపుణుడు నౌమాన్ నియాజ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను చూస్తుంటే అతను మనిషిలా కాకుండా ఒక రోబోలా ఆడుతున్నాడని అభివర్ణించాడు. "ఈ కుర్రాడిని చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తోంది. వాడా (WADA) వారు డోపింగ్ టెస్టులు చేసినట్లుగా.. ఇతనిని కూడా ఏదైనా ల్యాబ్‌కు తీసుకెళ్లి చెక్ చేయాలి. బహుశా ఇతని శరీరంలో ఏదో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) చిప్ అమర్చి ఉండవచ్చు. లేకపోతే ఇంత చిన్న వయసులో, అలాంటి ఫిజిక్ లేకుండా అన్ని భారీ సిక్సర్లు ఎలా కొట్టగలడు? ఇది అసాధ్యం" అని సరదాగా వ్యాఖ్యానించాడు. వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్, పవర్ హిట్టింగ్ చూసి పాక్ విశ్లేషకులు కూడా నోరెళ్లబెడుతున్నారు.

Vaibhav Sooryavanshi Epic Reply to Pakistan Expert Viral Remark Says God Put the AI Chip

తాజాగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 43 పరుగులు చేసి మరోసారి సత్తా చాటిన వైభవ్‌ సూర్యవంశీకి.. ఈ 'ఏఐ చిప్' కామెంట్ గురించి మీడియా ప్రతినిధులు వివరించారు. దానికి ఈ వండర్ బాయ్ ఎంతో పరిణతితో, అదే సమయంలో చాలా కామెడీగా సమాధానమిచ్చాడు. "అవును.. నా బ్యాట్‌లో ఆ చిప్‌ను భగవంతుడే అమర్చి పంపాడు. నేను పుట్టకముందే పైన స్వర్గంలో ఉన్నప్పుడు 'నీ బ్యాట్‌లో ఒక స్పెషల్ చిప్ పెడుతున్నాను, దాన్ని వాడుకో అని దేవుడు నాకు చెప్పాడు. ఇప్పుడు నేను ఆ వరంతోనే మైదానంలో చెలరేగిపోతున్నాను" అని బదులిచ్చాడు. వైభవ్ ఇచ్చిన ఈ తెలివైన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కేవలం మాటల్లోనే కాదు.. రికార్డుల్లోనూ వైభవ్ సూర్యవంశీ దూసుకుపోతున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అతి తక్కువ బంతుల్లో (167 బంతుల్లో) 400 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచి, ఆండ్రీ రస్సెల్ (188 బంతులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ శర్మ, నికోలస్ పూరన్ వంటి హార్డ్ హిట్టర్లను వెనక్కి నెట్టి 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం విశేషం. పాక్ నిపుణులు కూడా అసూయపడేలా ఆడుతున్న ఈ కుర్రాడు భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతున్నాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Story first published: Wednesday, April 29, 2026, 17:54 [IST]
Other articles published on Apr 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+