న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళల ఐపీఎల్ పోరు షురూ.., ఇదొక టీజర్ లాంటిది: కోహ్లీ

IPL 2018: Virat Kohli Wishes Smriti Mandhana, Harmanpreet Kaur Ahead Of Womens T20 Challenge Match

హైదరాబాద్: ఐపీఎల్‌లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. దేశ, విదేశీ ఆటగాళ్ల సమాహారంతో టీ20 ఫార్మాట్‌ను మహిళల క్రికెట్‌కు పరిచయం చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రయల్ బ్లేజర్స్, సూపర్‌నోవా జట్ల మధ్య ముంబై వాంఖడే వేదికగా టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో భారత క్రికెటర్లతో పాటు అలీస్సా హిలీ, సుజీ బేట్స్, డానియల్లీ వ్యాట్, మెగ్ ల్యానింగ్, మేగన్ స్కట్ లాంటి విదేశీ స్టార్లు బరిలోకి దిగుతున్నారు.

 ఆడటం కోసం ఆతృతంగా ఎదురుచూస్తున్నాం

ఆడటం కోసం ఆతృతంగా ఎదురుచూస్తున్నాం

ముంబైలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మంగళవారం సాయత్రం క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌ జరగనుంది. దాని కంటే ముందుగానే అంటే.. వాంఖడే మైదానంలో మధ్యాహ్నం మహిళల టీ20 మ్యాచ్‌ నిర్వహిస్తారు. దీనిపై ఇరు జట్ల కెప్టెన్లు కౌర్, మందన స్పందిస్తూ 'ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడటం కోసం ఆతృతంగా ఎదురుచూస్తున్నాం. విదేశీ ఆటగాళ్లతో కలిసి తొలిసారి మ్యాచ్ ఆడబోతున్నాం. మెరుగైన ప్రదర్శన ద్వారా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు చేసిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నాం' అని అన్నారు.

మంధాన, హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీ బాధ్యతలు

ఐపీఎల్‌ ట్రయల్‌ బ్లేజర్‌కు స్మృతి మంధాన, ఐపీఎల్‌ సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీ బాధ్యతలు వహించనున్నారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఇద్దరు కెప్టెన్‌లకు వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

టీజర్‌ లేదా ట్రైలర్‌గా కాబోతోంది

టీజర్‌ లేదా ట్రైలర్‌గా కాబోతోంది

‘మహిళల టీ20 లీగ్‌ను ప్రకటించినందుకు సంతోషిస్తున్నా. ముంబైలోని వాంఖడేలో మే 22న జరిగే మ్యాచ్‌.. మహిళల టీ20 లీగ్‌కు టీజర్‌ లేదా ట్రైలర్‌గా కాబోతోంది. స్మృతి, హర్మన్‌ రెండు జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. వారికి ఆల్‌ది బెస్ట్‌. మీ జట్లను మైదానంలో అత్యంత అభిరుచితో నడిపించాలని.. మీ ఆటేంటో అందరికీ చూపించాలని కోరుకుంటున్నా. మీ మ్యాచ్‌ను తప్పక వీక్షిస్తా' అని కోహ్లీ వీడియో సందేశం ఇచ్చాడు.

భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ క్రీడాకారిణులు

భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ క్రీడాకారిణులు

మహిళల టీ20 మ్యాచ్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ క్రీడాకారిణులు భాగం పంచుకోనున్నారు. ఐపీఎల్ 11లో ఆరంభంలో రాణించలేకపోయిన బెంగళూరు ద్వితీయార్థంలో దూసుకుపోయినా లాభం లేకుండా పోయింది. ప్లేఆఫ్ రేసులో నిలబడాల్సిన సమయంలో రాజస్థాన్ చేతిలో ఓడిపోవపడంతో అక్కడితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Story first published: Tuesday, May 22, 2018, 11:03 [IST]
Other articles published on May 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X