సునీల్ నరైన్ మెరుపులతో నైట్‌రైడర్స్ వెలుగులు

Posted By:
IPL 2018: Sunil Narine Stars As Kolkata Knight Riders Beat Royal Challengers Bangalore By 4 Wickets

హైదరాబాద్: ఐపీఎల్‌లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది. సునీల్‌ నరైన మరోసారి చెలరేగిపోయాడు. గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన నరైన్‌.. ఈ ఏడాది కూడా అదే జట్టుపై విశ్వరూపం ప్రదర్శించాడు. 17 బంతుల్లో నాలుగు ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడి మరో వేగవంతమైన వ్యక్తిగత హాఫ్‌ సెంచరీని నరైన్‌ నమోదు చేశాడు.

 బౌండరీల మోత మోగించి:

బౌండరీల మోత మోగించి:

ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన నరైన్ దూకుడుగా ఆడి బౌండరీల మోత మోగించాడు. అయితే 50 పరుగుల వద్దే నరైన్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

సుడిగాలి ఇన్నింగ్స్‌తో 19 బంతుల్లో (50)

సుడిగాలి ఇన్నింగ్స్‌తో 19 బంతుల్లో (50)

ఓపెనర్ సునీల్ నరైన్ 19 బంతుల్లో (50) సుడిగాలి ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోస్తూ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. సునీల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును:

ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును:

కాగా, ఐపీఎల్‌లో 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల సరసన నరైన్‌ మరోసారి నిలిచాడు. ఐపీఎల్‌ చరిత్రలో 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన క్రికెటర్లలో గిల్‌క్రిస్ట్‌(2009;) క్రిస్‌ గేల్‌(2013), పొలార్డ్‌(2016), మోరిస్‌(2017)లు ఉన్నారు. గత ఐపీఎల్‌ సీజన్‌లో నరైన్‌.. బెంగళూరుపైనే ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును నమోదు చేశాడు. దాంతో
ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించిన యూసఫ్‌ పఠాన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ బద్దలు:

పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ బద్దలు:

ఆ రికార్డును కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ బద్దలు కొట్టాడు. తాజా సీజన్‌లో భాగంగా ఆదివారమే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నమోదు చేశాడు.దాంతో నరైన్‌-పఠాన్‌ల రికార్డు బ్రేక్‌ అయ్యింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 10:00 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి