ఉప్పల్ స్టేడియంలో ముంబై క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్ (వీడియో)

Posted By:
IPL 2018, SRH vs MI: Away from home, Mumbai Indians face stern test against Sunrisers Hyderabad

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య గురువారం రాత్రి 8 గంటలకు జరగనుంది.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న ముంబై ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు జట్లకు ఇది రెండో మ్యాచ్ కావడం విశేషం. వాంఖడెలో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించి టోర్నీలో శుభారంభం చేసిన సన్‌రైజర్స్‌ రెండో మ్యాచ్‌లో కూడా గెలవాలని తహతహలాడుతోంది.

IPL 2018, SRH vs MI: Away from home, Mumbai Indians face stern test against Sunrisers Hyderabad

సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ జయవర్దనే పర్యవేక్షణలో ముంబై ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో ప్రాక్టీస్ చేశారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్ ఓటమిని పునరావృతం కానీయకుండా రెండో మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన చేయాలని భావిస్తున్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, April 11, 2018, 20:50 [IST]
Other articles published on Apr 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి