న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: RCBvKKR: మరోసారి బెంగళూరుకు షాకిచ్చిన కోల్‌కతా

ers-29th-match-report-from-

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు చిన్నస్వామి స్టేడియం వేదికగా సమరానికి తలపడ్డాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 19.1 ఓవర్లలో ఛేదించింది. క్రిస్‌ లిన్‌(62), రాబిన్‌ ఉతప్ప(36), సునీల్‌ నరైన్‌(27), దినేశ్‌ కార్తీక్‌(23) లు బ్యాట్ ఝళిపించడంతో కోల్‌కతా విజయాన్ని అందుకుంది. ఫలితంగా సొంత మైదానంలో ఓటమితో కోహ్లి సేనకు మరో వరుస వైఫల్యం మిగిలింది. తొలి మ్యాచ్‌లోనూ కోల్‌కతానే గెలిచింది.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి కోల్‌కతా 88/1:

ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం బ్యాటింగ్ కు దిగిన దినేశ్ కార్తీక్ జట్టుకు వరుణుడు కాస్త ఆటంకం కలిగించి వదిలిపెట్టాడు. దీంతో బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగా తీసుకుంది. బౌలర్లకు తగ్గ సమాధానం చెప్తూ కోహ్లీ సేన ఫీల్డింగ్ దాటుకుంటూ అడపదడపా బౌండరీలతో రెచ్చిపోతున్నారు. దీంతో పది ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 88పరుగులు చేసింది.

క్రీజులో రాబిన్ ఊతప్ప (21), క్రిస్ లిన్ (36) ఉన్నారు.


బెంగళూరుపై కోల్‌కతా టార్గెట్ 176

విరాట్‌ కోహ్లీ 44 బంతుల్లో (68 నాటౌట్‌) మరోసారి తన క్లాస్‌ ఆటతీరు ప్రదర్శించడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 176 పరుగుల లక్ష్యం నిర్దేశించింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. కోహ్లీ చక్కని బౌండరీలతో అలరించాడు.

క్వింటన్‌ డికాక్‌ (29), మెక్‌కలమ్‌ (38) తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 7 పరుగుల వ్యవధిలో ఔట్‌ కావడంతో జట్టు భారం కోహ్లీపై పడింది. నిలకడగా బ్యాటింగ్‌ చేసిన విరాట్‌ అందివచ్చిన బంతుల్ని చక్కగా బౌండరీ దాటించాడు. డివిలియర్స్‌ లేకపోవడంతో తనదైన దూకుడు ప్రదర్శించలేదు. ఆచితూచి ఆడుతూనే చివరి వరకు నిలిచాడు. జట్టు స్కోరును 175కు తీసుకెళ్లాడు. పరుగుల వరద పారే చిన్నస్వామి పిచ్‌ కాస్త భిన్నంగా కనిపించింది. కోల్‌కతాలో ఆండ్రూ రసెల్‌ 3 వికెట్లు తీశాడు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యే సరికి 75/3:

భారీ ప్రణాళికలతో బరిలోకి దిగిన కోహ్లీసేన జట్టులో మార్పులు కనిపిస్తున్నాయి. కానీ, పరుగులలో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. కోల్‌కతా బౌలర్ల ధాటికి పరవాలేదనిపించుకుంటున్న రన్ రేట్‌తో స్కోరును నడిపిస్తున్నారు. 9వ ఓవర్ ఆఖరి బంతికి మనన్ వొహ్రా వికెట్ కోల్పోయిన బెంగళూరు జట్టు మూడు వికెట్లు నష్టానికి 75 పరుగులు చేసింది. బౌండరీలు చేయడంలో కూడా కోహ్లీ జట్టు మొహమాటం చూపిస్తోంది.


టాస్ రిపోర్టు:

ఈ క్రమంలో కోల్‌కతా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్టు టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నామని టాస్ అనంతరం కెప్టెన్లిద్దరూ మాట్లాడుతూ అన్నారు.

ఇరు జట్లు ఆఖరి మ్యాచ్‌లో పరాజయంతోనే వెనుదిరిగాయి. ఏడు మ్యాచ్ లు ఆడి కేవలం 3 గెలిచిన కోల్‌కతా జట్టు లీగ్ పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అంతకంటే దారుణంగా బెంగళూరు జట్టు ఆరింటిలో 2మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది.

బెంగుళూరు వర్సెస్ కోల్‌కతా స్కోరు కార్డు:

కోహ్లీ జట్టులో నాలుగు కీలక మార్పులతో బరిలోకి దిగాడు. స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌కు వైరల్ ఫివ‌ర్ రావ‌డంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఏబీడీ స్థానంలో టిమ్ సౌథీ, కోరె ఆండర్స్ స్థానంలో బ్రెండన్ మెక్‌కలమ్, పవన్ నేగి స్థానంలో మనన్ వోహ్రా, వాషింగ్టన్ సుందర్ స్థానంలో మురుగన్ అశ్విన్‌లను తుది జట్టులోని తీసుకున్నట్లు కోహ్లీ వివరించాడు.

బౌలింగ్ విభాగంలో సరిగా రాణించలేకపోతోన్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ లో అయినా సరిగా రాణిస్తేనే ముందుకు దూసుకెళ్లగలుగుతుంది. కేవలం ఉమేశ్ యాదవ్, చాహల్ తప్పించి ఆ జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్లు కనిపించట్లేదు. ఇదిలా ఉంచితే బెంగళూరు జట్టు బ్యాటింగ్ ను తట్టుకుని నిలబడడం కోల్‌కతాకు కాస్త కష్టమైన పనే.


ఆడుతున్న ఇరు జట్లు:
బెంగళూరు జట్టు:
Quinton de Kock (wk), Virat Kohli (c), Manan Vohra, Corey Anderson, Mandeep Singh, Colin de Grandhomme, Murugan Ashwin, Tim Southee, Umesh Yadav, Mohammed Siraj, Yuzvendra Chahal
కోల్‌కతా జట్టు:
Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik (c) (wk), Shubman Gill, Andre Russell, Shivam Mavi, Piyush Chawla, Mitchell Johnson, Kuldeep Yadav

Story first published: Monday, April 30, 2018, 0:24 [IST]
Other articles published on Apr 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X