బెంగళూరు Vs పంజాబ్: గేల్ ఆడితే మా వద్ద ప్లాన్ ఉంది

Posted By:
IPL 2018: Royal Challengers Bangalore head coach Daniel Vettori sees no Chris Gayle fear ahead of Kings XI Punjab clash

హైదరాబాద్: శుక్రవారం జరిగే మ్యాచ్‌లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ ఆడతాడని తాను అనుకోవడం లేదని బెంగళూరు కోచ్‌ డానియేల్ వెటోరీ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం బెంగళూని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.

సొంత మైదానంలో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఉంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు సునీల్‌ నరైన్‌ మెరుపు ఇన్నింగ్స్‌, నితీష్‌ రాణా అల్‌రౌండ్‌ ప్రదర్శనతో కోహ్లీ సేన ఓటమి పాలైంది. అయితే ప్రస్తుతం బెంగుళూరు దృష్టి తమ మాజీ ఆటగాడైన‌ క్రిస్‌ గేల్‌పై ఉంది.

గేల్ ఆడితే మా వద్ద ప్లాన్ ఉంది

గేల్ ఆడితే మా వద్ద ప్లాన్ ఉంది

పంజాబ్‌ తొలి మ్యాచ్‌లో గేల్‌ ఆడలేదు. ఈరోజు జరిగే రెండో మ్యాచ్‌లో కూడా గేల్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు ప్రధాన కోచ్ డానియేల్ వెటోరి మాట్లాడుతూ 'చిన్నసామి స్టేడియంలో క్రిస్ గేల్ నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఒకవేళ గేల్‌ను పంజాబ్ ఆడించినా.. అతడిని కట్టడి చేసేందుకు తమ వద్ద గేమ్ ప్లాన్ ఉంది' అని అన్నాడు.

2011 నుంచి ఏడు సీజన్లలో బెంగళూరుకు

2011 నుంచి ఏడు సీజన్లలో బెంగళూరుకు

క్రిస్ గేల్‌ 2011 నుంచి ఏడు సీజన్లలో బెంగళూరు తరఫున ఆడాడు. బెంగళూరుకు 85 మ్యాచ్‌లాడిన క్రిస్ గేల్ 3000కు పైగా పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 151.20గా ఉంది. బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో పరిస్థితులు గేల్‌కు బాగా తెలుసు. 2013 ఐపీఎల్‌ ఎడిషన్‌లో గేల్‌ ఇక్కడే 175 పరుగులు సాధించాడు.

వేలంలో క్రిస్ గేల్‌ను కొనుగోలు చేసిన పంజాబ్

వేలంలో క్రిస్ గేల్‌ను కొనుగోలు చేసిన పంజాబ్

దీంతో రెండో మ్యాచ్‌లో క్రిస్ గేల్‌ ఆడితే ఎలా ఎదుర్కోవాలో అన్న దానిపై ఇప్పుడు బెంగళూరు దృష్టి సారించింది. కాగా, ఐపీఎల్ పదకొండో సీజన్‌లో క్రిస్ గేల్‌ను ఆర్‌సీబీ వదులుకోవడంతో వేలంలో కనీస ధరకు పంజాబ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో గేల్‌ను ఆడించలేదు.

క్రిస్ గేల్ బరిలోకి దిగితే ఓటమి భయం

క్రిస్ గేల్ బరిలోకి దిగితే ఓటమి భయం

శుక్రవారం తమతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు క్రిస్ గేల్‌ను బరిలోకి దించితే ఓడిపోతామనే గుబులు బెంగళూరులో ఇప్పుడే మొదలైంది. వచ్చే మూడేళ్లను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసిందని, అందుకే క్రిస్ గేల్‌ను బెంగళూరు యాజమాన్యం తీసుకోలేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 13, 2018, 14:44 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి